ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: మాజీ ఎమ్మెల్యే దివి శివరాంపై కేసు నమోదు

By narsimha lodeFirst Published Feb 19, 2021, 11:02 AM IST
Highlights

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న ఘర్షణకు సంబంధించి పోలీసులు ఈ కేసు పెట్టారు.
 

ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న ఘర్షణకు సంబంధించి పోలీసులు ఈ కేసు పెట్టారు.

 మూడవ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం నాడు కలవళ్లలో ఘర్షణ చోటు చేసుకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులనను తరలించకుండా తమ అనుచరులతో కలిసి అడ్డుకొన్నారని పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు శివరాంపై కేసు నమోదు చేశారు. అక్రమంగా తమపై కేసు నమోదు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడ పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ఆరోపించారు.వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  

 

 

click me!