టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ విడుదల

By AN TeluguFirst Published Feb 19, 2021, 10:47 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు రూరల్ స్టేషన్ నుంచి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. పోలీసులు గత అర్థరాత్రి చింతమనేని ప్రభాకర్ ను విడుదల చేశారు. బి.సింగవరం కేసుకు సంబంధించి పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చింతమనేనిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జ్ 41సి నోటీసు ఇచ్చి చింతమనేనిని విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే మీడియాతో మాట్లాడవద్దని సూచిస్తూ, అర్థరాత్రి ఆయనను ఇంటి దగ్గర పోలీసులు వదిలిపెట్టారు. 

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చారు. పెదవేగి మండలం బి. సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో వైసీపీ, తెదేపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో చింతమనేని లేనప్పటికీ ఆయనపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే చింతమనేని అరెస్టును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కేసుతో సంబంధం లేకున్న ఆయన్ని అరెస్ట్ చేశారని, టీడీపీ నేతలే లక్ష్యంగ వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

click me!