చంద్రబాబు నివాసం వద్ద జోగీ రమేశ్‌పై దాడి: 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

By Siva KodatiFirst Published Sep 18, 2021, 9:36 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నిరసన తెలియజేసేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై దాడికి సంబంధించి గుంటూరు జిల్లా, తాడేపల్లి స్టేషన్‌లో పలువురు టిడిపి నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నిరసన తెలియజేసేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై దాడికి సంబంధించి గుంటూరు జిల్లా, తాడేపల్లి స్టేషన్‌లో పలువురు టిడిపి నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో 11 మంది టీడీపీ నేతలు వున్నారు. అలాగే గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

కేసు నమోదైన టీడీపీ నేతలు వీరే: 

1. పట్టాబి.
2. గొట్టిముక్కల రఘు రామరాజు
3. చెన్నుపాటి గాంధీ 
4. నాగూల్ మీరా 
5. గద్దె రామ్మోహన్ రావు,
6. సుంకర విఘ్ణ.
7. నాదెండ్ల బ్రహ్మం.
8. బోడె ప్రసాద్ .
9. జంగాల సాంబశివరావు.
10. బుద్దా వెంకన్న .
11. తమ్మా శంకర్ రెడ్డి .

వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటివద్దకు టిడిపి శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎమ్మెల్యే జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు.

Also Read:చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అనుచరుల దాడి విజువల్స్

రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా  డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

click me!