సినీ ఫక్కీలో మావోయిస్టులు, పొలీసుల మధ్య కాల్పులు, ఆర్కే ఎస్కేప్

By Sreeharsha GopaganiFirst Published Jul 23, 2020, 9:30 AM IST
Highlights

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే, ఏఓబీ కార్యదర్శి చలపతి ఆయన భార్య అరుణ తప్పించుకున్నట్టు సమాచారం. ఆర్కే గాయాలు కాకుండా తప్పించుకున్నప్పటికీ.... చలపతి, అరుణాలకు మాత్రం బులెట్ గాయాలైనట్టుగా సమాచారం. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆంధ్ర ఒడిశా బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ తృటిలో తప్పింది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే, ఏఓబీ కార్యదర్శి చలపతి ఆయన భార్య అరుణ తప్పించుకున్నట్టు సమాచారం. ఆర్కే గాయాలు కాకుండా తప్పించుకున్నప్పటికీ.... చలపతి, అరుణాలకు మాత్రం బులెట్ గాయాలైనట్టుగా సమాచారం. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ప్రతిసంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమరవీరుల సంస్మరణ వార్షిక వారోత్సవాలను ఈ నెల 28 నుంచి నిర్వహించ తలపెట్టారు. కార్యక్రమాల రూపకల్పన కోసం వారంతా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారని ఈనెల 14న పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హాజరవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 

కూంబింగ్‌ మొదలుపెట్టి రెండురోజులు గాలింపు జరిపారు పోలీసులు. ఈ క్రమంలో ఈ నెల 16 తేదీన ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగినట్టు సమాచారం. కాల్పులు;యూ జరుపుతూ మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకువెళ్లినట్టు సమాచారం. 

అక్కడినుండి వారు విశాఖ జిల్లా వైపుగా వైపుగా అడవులగుండా పారిపోయారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు ఆంధ్రప్రదేశ్ ముంచంగిపుట్టు మండలం బుసిపుట్టు అటవీ ప్రాంతం, పెదబయలు మండలం జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల మీదుగా ఇంజెరి అటవీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహించసాగారు. 

మావోయిస్టుల ఎత్తులు, పోలీసు పై ఎత్తులు.... 

మావోయిస్టులు గుంపులు గుంపులుగా చీలి అడవిలో ప్రయాణించసాగారు. మొదటి బృందంలో సాధారణ మావోయిస్టులు, సాయుధులు మూడు బృందాలుగా పోలీసుల ముందు నుండే వెళ్లినప్పటికీ.... వారు కాల్పులు జరపలేదు. రెండవ గుంపు రాగానే వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ బృందంలోని చలపతి, అరుణ వంటి సీనియర్ నేతలు ఉన్నట్టు సమాచారం. 

పోలీసులు కాల్పులు జరపగానే వారంతా రెండు బృందాలుగా చీలిపోయి తప్పించుకున్నట్టు సమాచారం. పోలీసులు సేకరించిన సమాచారం, అక్కడ లభించిన సామాగ్రిలను బట్టి చూసి వారు వోచిన ప్రాథమిక అంచనా ప్రకారంగా అరుణ, చలపతిలు తీవ్ర గాయాలపాలైనట్టు నిర్ధారణకు వచ్చారు. 

ఇక రెండవ బృందంపై కాల్పులు జరపడంతో మూడవ బృందంలో ఉన్న ఆర్కే అటునుంచటే తప్పించుకున్నట్టు సమాచారం. ఆయనకోసం ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండడంతో అది మావోయిస్టులకు మరింతగా కలిసివచ్చింది. 

పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ చలపతి, అరుణలు ఎక్కువ దూరం వెళ్లలేరని గ్రహించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డవారు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని అంటున్నారు. 

click me!