పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట..

Published : Jul 23, 2020, 09:14 AM ISTUpdated : Jul 23, 2020, 09:17 AM IST
పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట..

సారాంశం

కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు.

వారిద్దరూ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని జీవితాంతం ఆనందంగా జీవించాలని కలలుకన్నారు. కానీ.. వారి ప్రేమపు పెద్దలు అంగీకరించలేదు. కులం పేరిట వారిని విడదీశారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని కుంగిపోయిన ఆ ప్రేమ జంట బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్‌(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు.

దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్‌ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

అమరావతి రైతుల అత్యవసర ప్రెస్ మీట్! | Amaravathi Farmers | Asianet News Telugu
బాబుపై జగన్ సెటైర్లు | YS Jagan Satires On CM Chandrababu Over Amaravati | Asianet News Telugu