
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌తో పాటు 45 మందిపై రామకుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవిను గతవారం ఎస్సై కృష్ణయ్య దూషించారని టీడీపీ ఆరోపిస్తుంది. దళిత వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ మహాదేవిని ఎస్‌ఐ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం చలో రామకుప్పం కార్యక్రమం చేపట్టింది.
Also Read: ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు.. ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోండి.. సీఎస్, డీజీపీలకు హైకోర్టు ఆదేశం..
నిరసనలో భాగంగా రామకుప్పంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. రామకుప్పం పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ శ్రేణులు ధర్మా కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ శ్రేణులు నిరసన ద్వారా విధులకు ఆటంకం కలిగించారని హెడ్‌కానిస్టేబుల్ మణి.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్రతో పాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.