ప్రేమ పేరిట మోసం.. రెండు సార్లు అబార్షన్, మళ్లీ గర్భం రావడంతో..

Published : Aug 14, 2020, 10:24 AM IST
ప్రేమ పేరిట మోసం.. రెండు సార్లు అబార్షన్, మళ్లీ గర్భం రావడంతో..

సారాంశం

ఈ క్రమంలో అతని కారణంగా యువతి రెండుసార్లు గర్భం దాల్చడం గమనార్హం. దీంతో.. రెండు సార్లు మాత్రలు తీసుకువచ్చి యువతి ఇచ్చి.. అబార్షన్ అయ్యేలా చేశాడు. 


ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలను యువతి గుడ్డిగా నమ్మేయడంతో.. శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా యువతి గర్భం దాల్చాక.. తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన ఒంగోలులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ యువతి స్థానికంగా ఒక దుకాణంలో పనిచేస్తోంది. వరసకు బావ అయ్యే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకుంటానని దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అతని కారణంగా యువతి రెండుసార్లు గర్భం దాల్చడం గమనార్హం. దీంతో.. రెండు సార్లు మాత్రలు తీసుకువచ్చి యువతి ఇచ్చి.. అబార్షన్ అయ్యేలా చేశాడు. తీరా.. తాజాగా మరోసారి యువతి గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో.. అతను పెళ్లికి నిరాకరించాడు. అప్పటి నుంచి కనిపించకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు