చిత్తూరులో దారుణం.. మరోసారి స్పందించిన సోనూసూద్

Published : Aug 14, 2020, 09:39 AM IST
చిత్తూరులో దారుణం.. మరోసారి స్పందించిన సోనూసూద్

సారాంశం

బుధవారం ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ తండ్రిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్తుండా వెంకట్రామయ్య ఆటోలోనే మరణించాడు. దాంతో ఆటో డ్రైవర్ శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.

కరోనా వైరస్ మానవ సంబంధాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తోంది. మనుషుల గుండెల్లో తడి కూడా ఆరిపోతోంది. అందుకు తగిన అమానుషమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం గ్రామంలో సంభవించింది.

గంగవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (73) అనే వ్యక్తి ఇంటి బయట పడుకున్నప్పుడు ఆవు దాడి చేసింది. దాడిలో వెంకట్రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. పక్కింటి ఆవు అతని గుండెలపై తొక్కడంతో పక్కటెముకలు విరిగాయి.

ఆదివారం ఉదయం కూతురు హేమలత అతన్ని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వచ్చింది. వారు అతన్ని పరీక్షించి స్కానింగ్ చేయాలని, తమ వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు. దాంతో ఆమె తన తండ్రిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకుని వెల్లింది. 

బుధవారం ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ తండ్రిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్తుండా వెంకట్రామయ్య ఆటోలోనే మరణించాడు. దాంతో ఆటో డ్రైవర్ శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.

నడిరోడ్డు మీద శవంతో రోదించడం ప్రారంభించింది. తన తండ్రి కరోనాతో చనిపోలేదని ఆమె చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదాలు ఎవరికీ పట్టలేదు.

కాగా.. ఈ దారుణ ఘటనపై సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. వెంకటరామయ్య కుమార్తెను పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవడానికి అతని మనుషులను పలమనేరుకు పంపనున్నారు. శుక్రవారం బెంగళూరు నుంచి సోనుసూద్ మనుషులు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోనున్నారు. కాగా.. ఇటీవల సోనూసూద్.. చిత్తూరులో ఓ రైతుకి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu