విశాఖపట్నంలో 70 కేసుల్లో ప్రమేయం ఉన్న దొంగ అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published May 25, 2023, 12:24 PM IST

ఓ దొంగ పది, ఇరవై కాదు ఏకంగా 70 దొంగతనాలు చేశాడు. దీనికి తల్లి, సోదరుడు, స్నేహితుడు సహకరించేవారు. వారందరినీ విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 


విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 70 చోరీ కేసుల్లో భాగస్వామ్యుడైన ఓ ప్రముఖ దొంగను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి నగర పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు. అతడిని విచారిస్తున్న సమయంలో దాదాపు 70 కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లుగా తేలింది. 

ఆ దొంగను నగరంలోని శివాజీపాలెం ప్రాంతానికి చెందిన ఎస్ అనిల్ కుమార్ (35)గా గుర్తించారు. దొంగతనాలకు పాల్పడే ముందు అనిల్ ముందుగా ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లి రెక్కీ నిర్వహించేవాడని నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమ్ వర్మ తెలిపారు.

Latest Videos

undefined

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న వైసీపీ.. అన్ని పార్టీలు హాజరు కావాలని కోరిన సీఎం జగన్..

అనిల్ ఇటీవల మే 6వ తేదీన గణేష్ నగర్‌లోని వాసవీ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లోని ఓ వైద్యుడి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు దోచుకెళ్లాడు. కేసును విచారిస్తున్న పోలీసులు నేరానికి తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించాడని గుర్తించారు. 

నిందితుడితో పాటు అతని తల్లి, సోదరుడు.. దొంగిలించిన వస్తువులను విక్రయించడంలో అతనికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ ఏప్రిల్ 18న కరీంనగర్ జైలు నుంచి విడుదలై 19న మెదక్ జిల్లాలో చోరీకి పాల్పడ్డాడని.. ముత్యాల తలంబ్రాలు, ద్విచక్రవాహనం చోరీకి పాల్పడ్డాడని వర్మ తెలిపారు.  అతని వద్ద నుంచి రూ.5.80 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

click me!