మదనపల్లి-బెంగళూరు హైవేపై బస్సు బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు..

Published : May 25, 2023, 12:00 PM IST
మదనపల్లి-బెంగళూరు హైవేపై బస్సు బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు..

సారాంశం

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లి-బెంగళూరు హైవేపై బస్సు బోల్తా పడింది.

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లి-బెంగళూరు హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.  మనుబోలు మండలం బద్దెవోలు వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న కంటైనర్‌ను కారు వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టిందని చెబుతున్నారు. రహదారిపై నిబంధనలకు విరుద్దంగా కంటైనర్‌ను రోడ్డుపై నిలిపి ఉంచినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu
CM Chandrababu: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పీచ్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్| Asianet News Telugu