శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షుడు కూన రవికుమార్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Apr 15, 2021, 11:55 AM IST
Highlights

పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తిలో అలజడికి కారణమయ్యాడంటూ నమోదయిన కేసులో శ్రీకాకుళం టిడిపి అధ్యక్షుడు కూన రవికుమార్ అరెస్టయ్యాడు. 

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తిలో అలజడికి కారణమయ్యాడని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు రవికుమార్ గత ఏడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  తాజాగా అజ్ఞాతాన్ని వీడియ ఆయన పోలీసులకు లొంగిపోయారు. 

ఈ క్రమంలో కూన రవికుమార్ కు పోలీసులు రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. 

read more   నేను, కూతురు మాత్రమే వుండగా... ఇంట్లోకి చొరబడిన పోలీసులు: కూన భార్య ఆందోళన

పరిషత్ ఎన్నికల రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవి కుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కూన రవి కుమార్ అక్కడ ఉండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దానికితోడు కూన రవి కుమార్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

click me!