మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి

By Arun Kumar PFirst Published Apr 15, 2021, 11:17 AM IST
Highlights

 స్వతహాగా డాక్టర్ అయిన గురుమూర్తి ప్రచారానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన బాధితులను చూసి చలించిపోయారు. తన బిజీ షెడ్యూల్ లోనూ గాయాలతో రోడ్డుపై పడివున్న వారికి ప్రథమ చికిత్స అందించారు.

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రచారంలో బిజీగా వున్నప్పటికి వైసిపి అభ్యర్థి గురుమూర్తి మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన గురుమూర్తి ప్రచారానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన బాధితులను చూసి చలించిపోయారు. తన బిజీ షెడ్యూల్ లోనూ గాయాలతో రోడ్డుపై పడివున్న వారికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన  నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఎంపీ ఆభ్యర్ధి గురుమూర్తి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్ శ్రీకాళహస్తి ప్రచారానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ బైక్ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు గాయాలతో పడివుండటాన్ని వీరు గుర్తించారు. దీంతో వెంటనే తన వాహనాన్ని నిలిపిన గురుమూర్తి వారికి ప్రథమ చికిత్స చేశారు. 

అంతేకాకుండా అంబులెన్స్ వచ్చేవరకు అక్కడేవుండి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఇలా ప్రచారంలో బిజీగా వున్నప్పటికీ క్షతగాత్రులకు సాయం చేసిన గురుమూర్తిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

ఇందకుముందు కూడా ఇలాగే ప్రమాదానికి గురయిన మహిళను కాపాడారు గురుమూర్తి. ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఆయన రేణిగుంట మండలం వెదుళ్లుచెరువు గ్రామం వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టి సుమిత్ర అనే మహిళ కాలు విరిగి పడిపోయి వుండటాన్ని గమనించాడు.  దీంతో వెంటనే స్పందించి సదరు మహిళకు ప్రథమచికిత్స అందించారు. బాధితురాలికి దైర్యం చెప్పి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి దగ్గరుండి పంపించారు.  
 

click me!