మరో ప్రేమోన్మాది.. యువతిపై కత్తితో దాడి

Published : Oct 06, 2018, 02:40 PM IST
మరో ప్రేమోన్మాది.. యువతిపై కత్తితో దాడి

సారాంశం

 ఆ యువతి తనను ప్రేమించలేదనే కారణంతోనే అతను ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మరో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. తనను ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి తీవ్రగాయాలపాలైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఏలూరులోని ఓ వస్త్ర దుకాణంలో దిలీప్‌ అనే యువకుడు, బాధిత యువతి పనిచేస్తున్నారు.   రోజులాగానే దుకాణానికి వచ్చిన యువతిపై ఆ దుకాణంలోనే కత్తితో దాడి చేశాడు.  ఆ యువతి తనను ప్రేమించలేదనే కారణంతోనే అతను ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన వారిపై కూడా నిందితుడు దాడికి దిగాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?