
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై జేసీ మండిపడ్డారు.
కేసీఆర్ ని పురాణాల్లోని బస్మాసురుడితో పోలుస్తూ కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న భాషతో కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని... దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందని అన్నారు.
మోదీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ప్రబోధానంద ఒక క్రిమినల్ అని అతని గురించి మాట్లాడటం వేస్ట్ అని ఎంపీ జేసీ అన్నారు.