హైవేపై అమ్మాయిల వలపు వల.. చిక్కారో..

By ramya neerukondaFirst Published Dec 19, 2018, 11:10 AM IST
Highlights

అమ్మాయిలు అందంగా ముస్తాబై.. తమ అందాలను చూపిస్తూ.. రోడ్డుపై వాహనాలను ఆపుతుంటారు. వారి అందానికి దాసోహమై.. బండి ఆపారో.. ఇక వాళ్ల పరిస్థితి అతంటే.. వ్యభిచారానికి పక్కకి వెళదాం అంటూ తీసుకువెళ్లి.. పూర్తిగా దోచేస్తారు. 

జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను అమ్మాయిలు.. తమ వలపులతో వల వేసి.. అనంతరం వారిని దారి దోపిడీ చేస్తున్నారు. కాగా.. ఈ దారి దోపిడీ దొంగలను ఎట్టకేలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎంతోకాలంగా నేషనల్ హైవేపై ముగ్గురు మహిళలు.. నలుగురు పురుషులు కలిసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరంతా అర్థరాత్రి దాటాక జాతీయ రహదారిపైకి వస్తుంటారు. అమ్మాయిలు అందంగా ముస్తాబై.. తమ అందాలను చూపిస్తూ.. రోడ్డుపై వాహనాలను ఆపుతుంటారు. వారి అందానికి దాసోహమై.. బండి ఆపారో.. ఇక వాళ్ల పరిస్థితి అతంటే.. వ్యభిచారానికి పక్కకి వెళదాం అంటూ తీసుకువెళ్లి.. పూర్తిగా దోచేస్తారు. ఆ మహిళతో ఉన్న పురుషులు వచ్చి.. వారిపై దాడిచేసి మరీ.. విలువైన వస్తువులన్నీ దోచుకుంటారు.

ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ.. ఏ ఒక్కరూ కేసులు పెట్టకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కాగా.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి మరీ ఈ ముఠాను పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున తన సిబ్బందితో చినకోండ్రుపాడు కాటూరి మెడికల్‌ కళాశాల వద్ద మాటువేశారు.

 ప్రత్తిపాడుకు చెందిన తన్నీరు అంకమ్మరావు తన ఆటోలో కాటూరి వైపు వెళుతుండగా మహిళలు ఆపడం, పక్కకు తీసుకెళ్లడం, అంతలో నలుగురు మగవారు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్‌ వద్ద నున్న రూ. 4750 నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా 25 సంవత్సరాలలోపు వారు కావడం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

click me!