యువతులకు పెళ్లి వల.. యువకులకు ఉద్యోగంతో గాలం వేసి...

By telugu teamFirst Published Feb 1, 2020, 7:52 AM IST
Highlights

తనకు తల్లిదండ్రులు లేరని, అన్నా వదినలు మాత్రమే ఉన్నారని, వారి మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయని చెప్పి అర్జంటుగా తనకు రూ.2 లక్షలు కావాలని కోరాడు. ఆమె ఏటీఎం కార్డు తీసుకుని పలు ప్రాంతాల్లో నగదును విత్‌డ్రా చేశాడు. తాను గన్నవరం ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీగుర్తింపు కార్డు సృష్టించాడు. 

అమ్మాయిలకైతే ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని గాలం వేస్తాడు. అదే ఎవరైనా యువకులు కనిపిస్తే.. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మిస్తాడు. వాళ్లు తనను పూర్తిగా నమ్మేసారు అని నిర్థారించుకున్నాక.. వాళ్ల దగ్గర నుంచి డబ్బు గుంజుతాడు. అనంతరం అక్కడి నుంచి పరరౌతాడు. కాగా.... ఆ కేటుగాడిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకోగా... ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు ప్రాంతానికి చెందిన బేతపూడి చినరామయ్య అలియాస్‌ రావూరి రాము అప్పులపాలై వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి కాలేదని తెలుగు మ్యాట్రిమొనిలో వధువు కావాలని పెట్టి, తాను ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తానని మభ్యపెట్టి పలువురిని మోసగించాడు. కైకలూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మకం కలిగించాడు. వీరిద్దరూ ఏలూరుబస్టాండ్‌లో ఒకరినొకరు కలుసుకుని తమ ఇష్టాలను తెలుసుకున్నారు.

Also Read ‘చచ్చిపోతున్నా... మీరు హ్యాపీగా ఉండండి అని సూసైడ్ నోట్ లో రాసి.....

తనకు తల్లిదండ్రులు లేరని, అన్నా వదినలు మాత్రమే ఉన్నారని, వారి మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయని చెప్పి అర్జంటుగా తనకు రూ.2 లక్షలు కావాలని కోరాడు. ఆమె ఏటీఎం కార్డు తీసుకుని పలు ప్రాంతాల్లో నగదును విత్‌డ్రా చేశాడు. తాను గన్నవరం ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీగుర్తింపు కార్డు సృష్టించాడు. 

ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కైకలూరు యువతిని నమ్మించాడు. దీంతో ఆమె తన బంధువైన తిరువూరుకు చెందిన అంబటి శ్యామ్‌కు చెప్పడంతో ఉద్యోగం కావాలంటూ రూ.2 లక్షలు రాముకు అందజేశాడు. అతడు నకిలీ అప్లికేషన్‌ తయారు చేసి శ్యామ్‌కు పంపించాడు. అది నకిలీ అప్లికేషన్‌గా గుర్తించిన శ్యామ్‌ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారికి దొరక కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
 
  శ్యామ్‌ గత నవంబరు 26న కైకలూరు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై షణ్ముఖ సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కైకలూరుకు చెందిన వారేకాక మ్యాట్రిమొని ద్వారా బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి గ్రామానికి చెందిన గజ్జల స్వాతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇస్తానని నమ్మకం కలిగించి రూ.1.60 లక్షలు తీసుకున్నాడని, ఇంకా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఎవ రైనా ఉంటే చెప్పమని చెప్పి ఆమె ద్వారా అడపా పెద్ది రాజు నుంచి రూ2.20 లక్షలు తీసుకున్నాడు. 

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా పరిచయమైన పాలకోడేరు మండలం శృంగవృక్షంకు చెందిన ఆకుమర్తి చంద్రశేఖర్‌ను విజయ్‌ అనే పేరుతో పరిచయం చేసుకుని పెళ్లి సంబంధాలు ఉంటే చెప్పమని, ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.85 వేలు తీసుకున్నాడు. పోలీసులు అతనిపై నిఘా పెట్టి శుక్రవారం కైకలూరు రైల్వేస్టేషన్‌లో మరో యువతితో పెళ్లి సంబంధం మాట్లాడుకునేందుకు వచ్చిన అతడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అతడిపై విజయవాడ, వీరవల్లి  పోలీస్ స్టేషన్  లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

click me!