వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ

Published : Feb 01, 2020, 06:49 AM IST
వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ అర్థరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార వికేంద్రీకరణను ఆచరణలో పెట్టింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి ఓ జీవోను జారీ చేసింది. న్యాయవిభాగానికి సంబంధించిన కొన్ని కార్యాలయాలు కర్నూలుకు తరలనున్నాయి.

అమరావతి: పాలనా వికేంద్రీకరణ విషయంలో ముందుకే సాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ విషయంలో శుక్రవారం అర్థరాత్రి ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఆ విభాగాలన్నీ వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవి కర్నూలు తరలనున్నాయి. ఈ విభాగాలన్నింటికీ అవసరమైన భవనాలు సమకూర్చాలని ఆర్ అండ్ బీ, కర్నూలు కలెక్టర్ కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

న్యాయసంబంధితమైన కార్యాలయాలను అన్నింటినీ కర్నూలులో పెడుతామని ఏపి ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఆ మేరకు తమ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ఓ వైపు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముందుకే వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దాన్ని అమలు పెడుతోంది.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu