‘కోరిక తీర్చకుంటే మిమ్మల్ని అంతం చేస్తా’

Published : Aug 01, 2020, 10:03 AM ISTUpdated : Aug 01, 2020, 10:09 AM IST
‘కోరిక తీర్చకుంటే మిమ్మల్ని అంతం చేస్తా’

సారాంశం

తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ ఇద్దరు యువతులను బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన ఆ యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.    

బాబా వేషంలో తిరుగుతూ.. యువతులను తన వలలో వేసుకోవడానికి ఓ దొంగ బాబా వేషాలు వేస్తున్నాడు. తన కోరిక తీర్చకుంటే.. మిమ్మల్ని నాశనం చేస్తానని, అంతం చేస్తానంటూ యువతులను భయబ్రాంతులకు గురిచేసేవాడు. కాగా..  ఈ సంఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూసలవీధికి చెందిన ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి చేతబడులు చేస్తా.. పూజలతో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రజలను నమ్మబలికాడు. ఈ క్రమంలో మహిళలను, యువతలను లోబర్చుకుని తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ ఇద్దరు యువతులను బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన ఆ యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.    

పోలీసులు సదరు బాబాను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వెంటనే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రంగప్రవేశం చేసి కేసు నమోదు కాకుండా రాజీ ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆడబిడ్డల జీవితాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ కుటుంబం రాజీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. రాసలీలలకు పాల్పడుతున్న బాబాకు అధికార పార్టీ నేతలు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బాబాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu