కోనసీమ అల్లర్ల కేసు: మరో 15 మంది అరెస్ట్

Published : Jul 24, 2022, 03:33 PM ISTUpdated : Jul 24, 2022, 03:58 PM IST
కోనసీమ అల్లర్ల కేసు: మరో 15 మంది అరెస్ట్

సారాంశం

కోనసీమ అల్లర్ల కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 235 మందిని అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 

అమలాపురం:కోనసీమ అల్లర్ల కేసులో మరో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 235 మందిని అరెస్ట్ చేశారు.Ambekdar konaseema జిల్లాగా  కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఈ ఏడాది మే 24వ తేదీన  Amalapuram లో కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లను ఆందోళనకారులు దగ్దం చేశారు. 

also read:నన్ను, నా భార్యను ఇంట్లోనే దగ్దం చేయాలని చూశారు: వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్

ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని కూడా దగ్దం చేశారు. మరో వైపు వాహనాలను కూడా దగ్దం చేశారు. ఇతర ప్రాంతాల నుండి  భారీగా పోలీసు బలగాలను  రప్పించిన తర్వాత  ఆందోళనలు ముగిశాయి..ఈ కేసులో వైసీపీకి చెందిన వారు కూడా ఉన్నారు. మంత్రి విశ్వరూప్ అనుచరులుగా ఉన్న సత్యరుషి, సుభాష్, మురళీ కృష్ణ, రఘులను కూడా అరెస్ట్ చేశారు. 

కోనసీమ అల్లర్ల కేసులో మరో 18 మందిని ఇటీవలనే అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మైనర్ కూడా వున్నాడు. వీరితో కలిపి కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు.

అమలాపురం ఘటనకు సంబంధించి పోలీసులు  కీలక విషయాలను గుర్తించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాలతో పాటు నిందితులను గుర్తించారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గత మాసంలోనే జరిగే కేబినెట్ సమావేశంలో ఈ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకొంది. అమలాపురం ఘటనకు సంబంధించి నిందితులు వాట్సాప్ ఆధారంగా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ లో ఎప్పుడు ఎలా చేయాలో కూడా చేశారని దర్యాప్తులో గుర్తించారు. 

అమలాపురం ఘటనకు సంబంధించి పోలీసులు  కీలక విషయాలను గుర్తించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాలను నిందితులను గుర్తించారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గత మాసంలోనే జరిగే కేబినెట్ సమావేశంలో ఈ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకొంది. 

అమలాపురం ఘటనకు సంబంధించి నిందితులు వాట్సాప్ ఆధారంగా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ లో ఎప్పుడు ఎలా చేయాలో కూడా చేశారని దర్యాప్తులో గుర్తించారు. కోనసీమ జిల్లాల అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ ఏడాది జూన్ 24వ తేదీన  ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?