పోలవరం ప్రధాన డ్యామ్ అంచనాలు పెంపు: ఏపీ సర్కార్ ఉత్తర్వులు

By narsimha lodeFirst Published Apr 19, 2021, 8:35 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ  ఏపీ ప్రభుత్వం  సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. 


అమరావతి: పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ  ఏపీ ప్రభుత్వం  సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం 5, 535 కోట్ల రూపాయలుగా జలవనరుల శాఖ నిర్ధారించింది. ప్రధాన డ్యామ్‌లో భాగమైన స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్, స్పిల్, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ. 1600 కోట్ల మేర పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీరు విడుదల చేస్తామని  ఏపీ ప్రభుత్వం చెబుతుంది.  ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని  గతంలో ఏపీ సీఎం జగన్, రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు  కేంద్రాన్ని కోరారు. 

 ఈ ప్రాజెక్టుకు చెందిన బకాయిలను విడుదల చేయాలని  ఏపీ ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరుతుంది గతంలో కూడ చంద్రబాబునాయుడు సర్కార్ కూడ  పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచింది. ఈ విషయమై అప్పట్లో విపక్షాలు  విమర్శలు గుప్పించాయి. ఏపీలో జగన్ సర్కార్  అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం  ప్రాజెక్టు  నిర్మాణ పనులు  నత్తనడకనసాగుతున్నాయని  టీడీపీ విమర్శిస్తోంది. 
 

click me!