లోకేష్ కోసం రూం రెడీ చేసి అలంకరించింది సోమిరెడ్డే..: కాకాని సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Apr 19, 2021, 07:27 PM IST
లోకేష్ కోసం రూం రెడీ చేసి అలంకరించింది సోమిరెడ్డే..: కాకాని సంచలనం

సారాంశం

సోమిరెడ్డి కంపు నోటితో రూ.43 కోట్లు అని చెబితే ఆ కంపును పీల్చిన మైకంలో లోకేష్ లేనిపోని అబద్ధాలను మాట్లాడాడని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ మండిపడ్డాడు. 

నెల్లూరు: మాజా మంత్రి నారా లోకేష్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచార సభలో నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కింద గత టిడిపి ప్రభుత్వ హయాంలో 43 కోట్లు విడుదల చేసినట్లు అబద్ధపు కూతలు కూశాడని   నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి కంపు నోటితో రూ.43 కోట్లు అని చెబితే ఆ కంపును పీల్చిన మైకంలో లోకేష్ లేనిపోని అబద్ధాలను మాట్లాడి వెళ్లాడన్నారు. ఇప్పుడు ఆ అబద్దాలను నిజం చేయడానికి సోమిరెడ్డి వెధవ వేషాలు వేస్తున్నాడని కాకాని మండిపడ్డారు. 

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాని మాట్లాడారు.  ఇసుకలో గానీ, ధాన్యం కొనుగోళ్లలో గానీ, ఇతరత్రా వాటిలో గానీ తాను అవినీతికి పాల్పడినట్లు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడిన మాటలకు కట్టుబడి వుండాలని... ఈ ఆరోపణలన్నీ నిజమని తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చంద్రబాబు ప్రమాణం చేయాలని కాకాని సవాలు విసిరారు. చంద్రబాబు దగ్గరకు వెళ్లి లిక్కర్ కేసులు మాఫీ చేయాలని కోరినట్టు అబద్దాలు ప్రచారం చేశారని... దీనిపైనా చంద్రబాబు ప్రమాణం చేయడానికి సిద్ధమా! అని నిలదీశారు.

''సోమిరెడ్డి లాంటి వెధవలు మంచి పనులు చేస్తే విమర్శిస్తారని ముందుగానే గమనించి, రైతులు, దాతలు అందించిన వివరాలతో పాటు, నేను ఖర్చు చేసిన కోటి పైచిలుకుతో కలిపి కరపత్రాలు ముద్రించి  పంపిణీ చేశా. చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, దొంగ, అవినీతిపరుడు, అబద్ధాలకోరు కడుపున పుట్టిన లోకేష్ అంత స్థాయి నాకు లేదని ఒప్పుకుంటున్నా.సోమిరెడ్డి "ఏలికపాము" లాంటివాడు, ఏలికపాములు ఎక్కడ ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు'' అంటూ విరుచుకుపడ్డారు. 

read more  కుక్క కరిస్తే... తిరిగి కుక్కని మనం కరవలేముగా...: కాకానిపై జవహర్ ఫైర్

''ఎన్టీఆర్, లక్ష్మీపార్వతీల కోసం సోమిరెడ్డి అల్లీపురంలో రూము కట్టించి, అలంకరించి పెట్టి టికెట్ కొట్టేసినట్లు లోకేష్ కు కూడా రూము అలంకరించి, ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎలక్షన్ల పేరిట కలెక్షన్లు, కార్యకర్తలకు ఇవ్వాల్సిన బూత్ ఖర్చులను జేబులో వేసుకొని, చంద్రబాబు, లోకేష్ సభలకు జనం తరలింపు పేరిట డబ్బు కాజేసిన నేలటికెట్టు గాడు సోమిరెడ్డిది ఒక బ్రతుకా!. సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేయడం కాదు తిరుపతి ఉప ఎన్నికలను "రెఫరెండం" గా స్వీకరించేందుకు సిద్ధమా!, స్వీకరించే దమ్ము, ధైర్యముందా!, అని నేను సవాళ్లు విసురుతుంటే, సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోతున్నాడు'' అని విమర్శించారు. 

''సోమిరెడ్డి లాంటి లుచ్చాగాడిని, లోకేష్ లాంటి  బచ్చాగాడిని, చంద్రబాబు లాంటి  అబద్ధాలకోరుని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడికి నీతి, నిజాయితీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఉంటే నా సవాలును స్వీకరించి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి వెంటనే తిరుపతికి బయలుదేరి రావాలి'' అని కాకాని సూచించారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu