విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం... సీఎం జగన్ కు ప్రధాని ఫోన్

By Arun Kumar PFirst Published Aug 9, 2020, 10:01 AM IST
Highlights

 స్వయంగా ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ఈ అగ్నిప్రమాధానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అమరావతి: విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. స్వయంగా ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ఈ అగ్నిప్రమాధానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని సీఎంకు సూచించారు. 

''ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచింది.  అయితే ప్రమాదవవశాత్తు ఆ బిల్డింగ్ లో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. అయినప్పటికి దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారు'' అని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. 

''ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించాం. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. ఈ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించాము'' అని ప్రధాని మంత్రికి సీఎం జగన్ తెలిపారు.

read more  విజయవాడ అగ్ని ప్రమాద మృతులకు 50 లక్షల పరిహారం: జగన్

విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. 

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు మృత్యువాతపడగా చాలామంది తీవ్ర అస్వస్ధతకు గురయినట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు.  
 

click me!