PM Modi Bhimavaram Visit: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

Published : Jul 04, 2022, 10:45 AM IST
PM Modi Bhimavaram Visit: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

సారాంశం

ప్రధాని మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.  అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్‌, సీఎం భీమవరం బయలుదేరి వెళ్లారు. 

ప్రధాని మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్‌, సీఎం భీమవరం బయలుదేరి వెళ్లారు. భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.

భీమరవం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరాను. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను మెరుగుపరుస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. 

ఇక, మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంటారు. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ కూడా భీమవరం వెళ్లనున్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.  అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.  

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?