ఏపీలో టెన్షన్ టెన్షన్... దెబ్బతిన్న వంతెన మీదుగానే ప్రధాని మోదీ ప్రయాణమా?

By Arun Kumar PFirst Published Jul 4, 2022, 10:18 AM IST
Highlights

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కోసం ప్రధాని మోదీ ఏపీ పర్యటన అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ధ్వంసమైన ఓ వంతెన మీదుగా మోదీ కాన్వాయ్ ప్రయాణించే అవకాశం వుండటమే ఈ టెన్షన్ కారణం. 

అమరావతి : అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో (azadi ka amrit mahotsav) భాగంగా మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి (alluri 125th jayanthi) వేడుకలను ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో రూ.30 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఆవిష్కరించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రధాని రోడ్డుమార్గంలో వెళితే మాత్రం అధికారులు టెన్షన్ తప్పేలా లేదు.  

ఇటీవల కురుస్తున్న వర్షాలకు కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఔటర్ రింగ్ రోడ్ రిటైనింగ్ వాల్ ధ్వంసమయ్యింది. దీంతో ఎలాంటి ప్రమాదం జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు వాల్ ధ్వంసమైన చోట వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. అయితే ప్రధాని మోదీ రోడ్డుమార్గంలో వెళితే ఇదే రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వుంటుంది. కానీ ఇప్పటివరకు దెబ్బతిన్న రిటైనింగ్ వాల్ మరమ్మతులు చేపట్టకపోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది.  

read more  ఏపీలో మోదీ పర్యటన : అర్థాంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణంరాజు.. ఏ జాబితాలోనూ రఘురామ పేరు లేదన్న డీఐజీ

భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ రోడ్డుమార్గంలోనే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు గన్నవరం-భీమవరం  మార్గంలో రెండుసార్లు వాహన శ్రేణి ట్రయల్ రన్ కూడా చేపట్టారు. ఇదే మార్గంలో ప్రధాని తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి వుంది. దీంతో హనుమాన్ జంక్షన్ బైపాస్ లో వంతెన దెబ్బతినడం... ఇప్పటికీ మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని వాహనశ్రేణి వెళ్లడానికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపడతున్నారు. 

ఏపీలో ప్రధాని పర్యటన షెడ్యూల్: 

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం గత రెండురోజులుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బసచేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయమే బేగంపేట విమానాశ్రయం నుండి ఏపీకి బయలుదేరతారు. 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు.  అక్కడ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ఉన్నతాధికారులు, బిజెపి నాయకులు స్వాగతం పలకనున్నారు. 

ఎయిర్ పోర్టు నుండి ఎంఐ-1 హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకోన్నారు ప్రధాని. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ప్రధాని రోడ్డు మార్గంలోనే భీమవరం చేరుకుంటారు. అక్కడ మన్యవీరుడు అల్లూరీ సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో భాగంగా విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగసభలో పాల్గొననున్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధానితో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తో పాటు ఇతర నాయకులు పాల్గొననున్నారు. 

ప్రధాని పర్యటన  నేపథ్యంలో ఏపీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఎస్పీజి అధికారులు కూడా ప్రధాని  పర్యటించే ప్రాంతాలను తనిఖీలు చేపట్టారు. ప్రధాని రోడ్డుమార్గంలో వెళితే అడ్డుకోడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయం వద్దే కాదు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 


 
 

click me!