Published : May 02, 2025, 11:59 AM ISTUpdated : May 02, 2025, 06:19 PM IST

PM Modi Amravati Tour Live Updates: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి : ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల‌కు నాంది ప‌డ‌నుంది. నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌ధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. మోదీ అమ‌రావ‌తి టూర్‌కు సంబంధించిన లేటెస్ట్ లైవ్ అప్టేడ్స్ ఇక్క‌డ చూడండి. 
 

PM Modi Amravati Tour Live Updates: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి : ప్రధాని నరేంద్ర మోడీ

05:49 PM (IST) May 02

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఏపీకి వస్తున్నాను: ప్రధాని మోడీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నేను ఆంధ్రప్రదేశ్‌కి వస్తాన‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానంపై స్పందనగా, అదే రోజున ఏపీలో పర్యటించనున్నట్లు చెప్పారు.

విశాఖపట్నంలోని ఏక్తా మాల్ ప్రాజెక్టును ప్రధాని ప్రస్తావిస్తూ, ఇది హస్తకళల నిపుణులకు గొప్ప ప్రోత్సాహం కలిగించే అవకాశాల‌ను ప్ర‌స్తావించారు. దేశీయంగా తయారయ్యే చేతిపనులకు మార్కెట్‌ను విస్తరించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

05:44 PM (IST) May 02

ఆయుధాలే కాదు.. ఐకమత్యమే మన బలం: ప్రధాని మోడీ

శ్రీహరికోట నుంచి జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలు దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గర్వించేటట్లు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇవి భారత శాస్త్రీయ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.

మన బలం ఆయుధాల్లో కాదు.. ఐకమత్యంలో ఉందని ప్ర‌ధాని మోడీ ఆకాంక్షను వెలిబుచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాలు కలిసి ముందుకు సాగాలన్నారు.

05:42 PM (IST) May 02

పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది: ప్రధాని మోడీ

పోలవరం ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రతి పొలానికి నీరు అందించాలి, సాగునీటికి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు భరోసా కలుగుతుందని చెప్పారు.

అలాగే, నదుల అనుసంధానం ద్వారా సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల సమస్యలు నివారించడమే మా ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. 

05:34 PM (IST) May 02

టెక్నాలజీని చంద్రబాబు వినియోగించడాన్ని అప్పట్లో నేనూ గమనించాను: మోడీ

ఇప్పటికే అమరావతిలో ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వాడకంపై దృష్టి సారించిన విషయంపై ప్రశంసలు కురిపించారు. "నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో నేను గమనించాని ప్రధాని" అన్నారు.

05:32 PM (IST) May 02

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ ప్రారంభం: ప్రధాని నరేంద్ర మోడీ

ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాల్లో అమరావతి దేశంలో ముందు వరుసలో నిలవబోతోంది. ఇవి కేవలం శంకుస్థాపనలుగా కాదు, అభివృద్ధి చెందిన భారత దేశం దిశగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న దశలను సూచించే కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని ప్రధాని మోడీ అన్నారు. 

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ ప్రారంభం. రికార్డు స్థాయిలో ఈ పనులను పూర్తిచేయడంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది. మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి అవసరమైన సహాయం అందించిందని ప్రధాని తెలిపారు. 

 

05:29 PM (IST) May 02

ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది: ప్రధాని మోడీ

ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. తాను, చంద్రబాబు, పవన్ కలిసి వికసిత్  ఆంధ్రకోసం పనిచేస్తున్నామని చెప్పారు.  

05:18 PM (IST) May 02

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి : మోడీ

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి :  ప్రధాని మోడీ 

05:15 PM (IST) May 02

తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని మోడీ

అమరావతి పున:నిర్మాణం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. 

05:06 PM (IST) May 02

దేవతలు ఆశీర్వదించారు.. అది మోడీ పవర్: చంద్రబాబు

మోడీజీ వస్తున్నారని వర్షం రాకుండా దేవతలు ఆశీర్వదించారు, అది మోడీ పవర్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

05:03 PM (IST) May 02

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రాజధాని అమరావతిలో 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. 

05:02 PM (IST) May 02

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం : చంద్రబాబు

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం, అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తాం.. రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.. మోడీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం.. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్.. 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి: చంద్రబాబు

04:44 PM (IST) May 02

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాంః నారాయణ

రూ. 64వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి చూపిస్తామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పనులు ఊపందుకున్నాయి.

04:42 PM (IST) May 02

మోడీ నాయకత్వంలో న్యూ ఇండియా గా మారుతోంది: చంద్రబాబు

మోడీ నాయకత్వంలో భారతదేశం  ప్రగతిలో దూసుకుపోతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. మోడీ నాయకత్వంలో ఇండియా న్యూ ఇండియా గా మారుతుంది అని తెలిపారు. మోడీ దేశానికి ప్రధాని కావడం గర్వకారణమని చెప్పారు. మోడీ సారథ్యంలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చంద్రబాబు అన్నారు.

04:37 PM (IST) May 02

ఉగ్రవాదంపై చర్యలకు ప్రధాని మోడీ వెంట ఉంటాం: చంద్రబాబు

పదేళ్ల క్రితం అమరావతికి మోడీ శంకుస్థాపన చేశారు. గతంలో మోడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేవారు . కానీ ఇప్పుడు ఉగ్రదాడి కారణంగా ఆవేదంలో కనిపించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలలో ప్రధాని మోడీ వెంట ఉంటాం: చంద్రబాబు

04:35 PM (IST) May 02

ఏం చేసినా మీకు అండగా ఉంటాం మోడీజీ: చంద్రబాబు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడిలో మన పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషయంలో మీరు ఏం చేసినా మీకు అండగా ఉంటాం మోడీజీ: చంద్రబాబు నాయుడు

04:33 PM (IST) May 02

ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది : చంద్రబాబు

చరిత్రలో ఇది చాలా గొప్ప రోజు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అమరావతి పనులు తిరిగి ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఇది చాలా గొప్ప రోజు : చంద్రబాబు నాయుడు

04:27 PM (IST) May 02

ప్రధాని మోడీకి ఇల్లు లేకపోయినా.. పవన్ కళ్యాణ్

ప్రధాని నరేంద్ర మోడీకి ఇల్లు లేకపోయినా ఆంధ్ర ప్రజలకు ఇల్లు ఉండాలని, 140 కోట్ల మందికి ఇల్లు ఉండాలని దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాడు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

04:24 PM (IST) May 02

ఇబ్బందులు ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ప్రధాని వచ్చారు: పవన్ కళ్యాణ్

కాశ్మీర్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇబ్బందులు ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఇక్కడకు వచ్చారు. ప్రధాని మోడీజీకి ప్రత్యేక ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

04:20 PM (IST) May 02

భూమి మాత్రమే కాదు.. రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారు : పవన్ కళ్యాణ్

అమరావతి రైతులు కేవలం రాజధాని నిర్మాణం కోసం భూములు మాత్రమే కాదు రాష్ట్రానికి భవిష్యత్తులను ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. వారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని అన్నారు.

04:18 PM (IST) May 02

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేసింది.. పవన్ కళ్యాణ్

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని తరలిపోతుందని చాలామంది భయపడ్డారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ అమరావతి పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. అమరావతి మహిళా రైతులు విద్యార్థుల పోరాటం మరువలేనిదని అన్నారు.

04:15 PM (IST) May 02

అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోము.. పవన్ కళ్యాణ్

ఏపీ రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోమని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని చెప్పారు.

04:14 PM (IST) May 02

ఇబ్బందులున్న ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నాం.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని, అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం తీసుకొస్తున్నామని నారా లోకేష్ అన్నారు. ఇబ్బందులు ఉన్న ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

04:08 PM (IST) May 02

ప్రధాని మోడీని సన్మానించిన చంద్రబాబు, పవన్

ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్మానించారు.

04:08 PM (IST) May 02

ప్రధాని మోడీని సన్మానించిన చంద్రబాబు, పవన్

ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్మానించారు.

04:08 PM (IST) May 02

ప్రధాని మోడీని సన్మానించిన చంద్రబాబు, పవన్

ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్మానించారు.

03:27 PM (IST) May 02

అమరావతి సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.  ప్రత్యేక హెలికాప్టర్లో సభా ప్రాంగణం సమీపంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యింది. 
 

03:16 PM (IST) May 02

వెలగపూడికి బయలుదేరిన ప్రధాని మోదీ

గన్నవరం నుండి వెలగపూడి బయలుదేరారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నాయి.  అక్కడినుండి వీరంతా అమరావతి పునర్నిర్మాణ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 

03:12 PM (IST) May 02

మోదీకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్వాగతం

 గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు మంత్రులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు.

03:03 PM (IST) May 02

ప్రత్యేక హెలికాప్టర్లో సభాప్రాంగణానికి మోదీ

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటారు  రాజధాని పునర్‌నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అమరావతికి భారీగా తరలివస్తున్న జనాలు. దీంతో అమరావతికి వచ్చే అన్ని మార్గాల్లో రద్దీ నెలకొంది. 

02:54 PM (IST) May 02

గ‌న్న‌వ‌రం చేరుకున్న ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌న్న‌వరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. నేరుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యం వెళ్ల‌నున్నారు. ప్ర‌ధానికి స్వాగ‌తం పలికేందుకు కూట‌మి నేత‌లు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్నారు. 

02:51 PM (IST) May 02

మోదీ ప్రారంభించనున్న రైల్వే ప్రాజెక్టులు

గుంతకల్ వెస్ట్ - మల్లప్ప గేట్ రైల్వే లైన్ – రూ. 293 కోట్లు

ఖాజీపేట – విజయవాడ 3వ లైన్ – రూ. 254 కోట్లు

బుగ్గనపల్లి – పాణ్యం డబ్లింగ్ లైన్లు (గుంటూరు - గుంతకల్ ప్రాజెక్టులో భాగంగా)

హైవే, రవాణా ప్రాజెక్టులు (NHAI): నేషనల్ హైవే ప్రాజెక్టులు – రూ. 3,176 కోట్లు (వర్చువల్ శంకుస్థాపన), పలు NH పనులు ప్రారంభం – రూ. 3,680 కోట్లు

02:37 PM (IST) May 02

పైలాన్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ..

అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని మోదీ అమరావతి వస్తున్నారు. అమరావతి పునర్‌నిర్మాణానికి సూచికగా A ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను మోదీ ఆవిష్కరించనున్నారు. 

02:27 PM (IST) May 02

అమరావతి పున:నిర్మాణ శంకుస్థాపన లైవ్ వీడియో ఇక్కడ చూడండి.

02:15 PM (IST) May 02

అమరావతి రాజధాని ప్రాజెక్టుల కోసం శంకుస్థాపన:

మొత్తం విలువ: రూ. 49,040 కోట్లు

నిర్మించబోయే భవనాలు:

కొత్త హైకోర్టు

సచివాలయం

శాసనసభ భవనం

న్యాయమూర్తుల నివాస సముదాయం

ఎమ్మెల్యేలు, మంత్రులు, IAS అధికారుల గృహ సముదాయాలు

02:08 PM (IST) May 02

ప్ర‌ధాని మోదీ అమ‌రావ‌తి టూర్ ముఖ్యంశాలు:

* మ‌ధ్యాహ్నం 2.55 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. 

* హెలికాప్ట‌ర్‌లో మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల‌కు వెలగపూడి సభాస్థలికి చేరుకుంటారు. 

* సాయంత్రం 4:55కి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. ప్ర‌ధాని మొత్తం 1 గంట 15 నిమిషాలు ఏపీలో ఉంటారు. 
 

12:18 PM (IST) May 02

భద్రత కట్టుదిట్టం

ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీస్‌ నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన గేట్‌ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. విమాన టికెట్‌ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేమార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 

12:14 PM (IST) May 02

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్

అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల ప్రారంభానికి విచ్చేస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ చేశారు. రాజధాని పునఃనిర్మాణపనులను ప్రారంభించేందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

12:11 PM (IST) May 02

కృతజ్ఞతాపూర్వక స్వాగతం

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి చంద్ర‌బాబు స్వాగ‌తం తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిద‌ని, రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది రాసుకొచ్చారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని, ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధానికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం అని చంద్రబాబు రాసుకొచ్చారు. 

12:02 PM (IST) May 02

మోదీ అమరావతి షెడ్యూల్

* మే2వ తేదీ మ‌ధ్యాహ్నం 2.50 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 

* మ‌ధ్యాహ్నం 3:10  గంట‌ల‌కు హెలికాఫ్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. 

* మ‌ధ్యాహ్నం 3.25 గంట‌ల‌కు స‌భా ప్రాంగాణానికి చేరుకొని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. 

* సాయంత్రం 4:45 గంట‌ల‌కు హెలికాఫ్టర్ ద్వారా గ‌న్న‌వ‌రం చేరుకొని అక్క‌డి నుంచి విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్తారు. 


More Trending News