ప్రకాశం జిల్లాలో పావురం కలకలం: పావురం కాలుకు చైనా ట్యాగ్

Published : Jan 05, 2022, 01:46 PM ISTUpdated : Jan 05, 2022, 02:34 PM IST
ప్రకాశం జిల్లాలో పావురం కలకలం: పావురం కాలుకు  చైనా ట్యాగ్

సారాంశం

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురాళ్లు కలకలం రేపాయి. ఒడిశా రాష్ట్రంలో మాదిరిగానే ప్రకాశం జిల్లాలో కూడా  పావురాళ్లకు ట్యాగులున్నాయి.ఈ ట్యాగ్ చైనాకు సంబంధించనవిగా స్థానికులు అనుమానిస్తున్నారు.  


ఒంగోలు: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. Pigeon   కాళ్లకు china కి చెందిన ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కుడికాలుకి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్‌ను గమనించారు. ఈ ట్యాగ్‌పై AIR 2207 అనే కోడ్ నంబర్ ఉంది.  ఇది చైనాకు చెందిన పావురమా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పావురాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వైపు Odisha రాష్ట్రంలో కూడా ఇదే తరహలో పావురాలు కలకలం రేపుతున్నాయి.

also read:ఆ పావురం నాది.. తిరిగి ఇచ్చేయండి.. మోదీకి పాక్ వాసి విన్నపం

పావురాలను పందెలకు పంపే సమయంలో పావురాల కాళ్లకు ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారని కొందరు చెబుతున్నారు. చీమకుర్తిలో దొరికిన  పావురానికి దొరికిన ట్యాగ్‌లో ఉన్న అంక్షరాలు పావురాల పందెనికి సంబంధించినవని  కొందరు జంతువులు, పక్షులను పెంచే వాళ్లు చెబుతున్నారు. ఎఐఆర్ అనేది రేసింగ్ ను సూచిస్తుందన్నారు. ఏ సంవత్సరంలో రేసింగ్ నిర్వహించారు, పక్షి నెంబర్ ను సూచిస్తూ అంకెలుంటాయని కూడా  వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

ఒడిశాలో కూడా..

ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు కలకలం రేపాయి. వీటి కాళ్లకు సైతం కోడ్ నంబర్లతో కూడిన రబ్బర్ ట్యాగ్‌లు ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని రవురెక్కలాలో, మంగళవారం కేంద్రపడ జిల్లా మార్ సగై పోలీస్ స్టేషన్‌ పరిధి దశరథపుర్‌లో మరోటి దొరికాయి. వీటిలో ఒక పావురం కాలికి వీహెచ్ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉంది. మరో పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ ఉన్నాయి. అయితే ఈ పావురాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిశాలో దొరికిన పావురం పెంపుడు పావురంగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పావురం కాలుకు ఉన్న ల్యాగ్ పై చైనా అక్షరాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

పావురం కాలుకు ఉన్న ట్యాగ్ పై ఉన్న బ్యాడ్జ్ పై కొన్ని చైనీస్ అక్షరాలు ఉన్నాయని రాజ్‌గంగాపూర్ ఎస్‌డీపీఓ శశాంక్ శేఖర్ చెప్పారు.  అయితే పావురం కాలుకి ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్ లేదా పరికరం జోడించలేదని ఆయన చెప్పారు. వివిధ దేశాల ప్రజలు తమ పెంపుడు జంతువులు, పక్షుల గుర్తింపు కోసం బ్యాడ్జ్‌లు, ట్యాగులు ఉంచుతారు. ఆ రకంగానే ఈ పావురాలపై ట్యాగ్ లను ఏర్పాటు చేశారా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 చైనా భాషకు చెందిన అక్షరాలు ఉండడంతో పావురాలను చైనా దేశం గూఢచర్యం కోసం ఏమైనా ఉపయోగించిందా అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా లేకపోలేదు. అయితే ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఒడిశాలో పావురాలు కలకలం రేపిన రెండు రోజులకే ప్రకాశం జిల్లాల్లో కూడా అదే తరహలో పావురాలు కన్పించాయి. అయితే ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu