ఏపీలో పావురాల పందాలు.. చెన్నై నుంచి వచ్చి అద్దంకి నుంచి నిర్వహణ.. ఏడుగురు అరెస్ట్..

Published : Feb 07, 2022, 10:12 AM IST
ఏపీలో పావురాల పందాలు.. చెన్నై నుంచి వచ్చి అద్దంకి నుంచి నిర్వహణ.. ఏడుగురు అరెస్ట్..

సారాంశం

ఏపీలో మరో కొత్త రకం పదాలకు తెరలేపారు పందెం రాయుళ్లు. వందలాది పావురాలను గాల్లోకి ఎగరవేసి.. వాటిలో ఏది ముందుగా గమ్యాన్ని చేరితే దాన్ని విజేతగా ప్రకటించి బహుమతులిస్తున్నారు. వీటిమీద జోరుగా బెట్టింగులు కూడా కాస్తున్నారు. 

నెల్లూరు : కోడిపందాలు, ఎడ్ల పందాలు ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడంతా పావురాల పందాల హవా నడుస్తోంది. నిజమేనా? అంటే నిజమే అంటున్నాయి కొన్ని సంఘటనలు.. andhrapradesh లో ఇటీవలి కాలంలో ఇలాంట పందాల కేసులు వరుసగా నమోదవుతున్నాయి. గుంపుల కొద్దీ pigeonsను ఒక్కసారిగా ఎగురవేసి.. వాటి వేగాన్ని బట్టి.. విజేతను నిర్ణయిస్తున్నారు. అంతేకాదు వీటిమీద కోట్ల రూపాయల pigeon betting కూడా జరగుతోందని చెబుతున్నారు. 

ఇప్పటి వరకు prakasam districtలో జరిగిన పావురాళ్ల పందేలు ప్రస్తుతం పక్కనే ఉన్న nellore జిల్లాకు పాకాయి. నాయుడుపేటలో పిజియన్ ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. వందలాది పావురాలను ఎగర వేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నాయుడుపేట నుంచి చెన్నైకి పావురాల పందాలు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. చెన్నైకి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల ఏపీలో వరుసగా ఈ పావురాళ్ల పందేలు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ శివార్లలో ఒక్కసారిగా వందలాది పావురాలు గాల్లోకి ఎగిరాయి. ప్రజలు ఏమైందోనని ఆందోళన చెందారు. చాలామంది హుటాహుటిన గ్రామ శివారుల్లోకి వచ్చి.. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. అక్కడ చెన్నై నుంచి వచ్చి పావురాల పందాలు నిర్వహిస్తున్నారు పందెంరాయుళ్లు. పావురాల బెట్టింగ్ తో హల్ చల్ చేశారు.

ఈ పిజియన్ రేస్ కోసం చెన్నై నుంచి నాలుగు లారీలలో ప్రత్యేకంగా తయారు చేసిన బోనుల్లో పావురాలను తీసుకువచ్చారు నిర్వాహకులు. చిన్న కొత్తపల్లి వద్ద ఆ పావురాలని వదిలిపెట్టారు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేతగా నిలుస్తుందని అంటున్నారు. ఆ పావురం యజమానికి విండో పిజియన్ అనే సంస్థ బహుమతి ఇవ్వనుంది.  ఈ విండో పిజియన్ సంస్థ ఆధ్వర్యంలోనే పిజియన్ రేసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే చెన్నై నుంచి ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఎందుకిలా వదిలేస్తున్నారని స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో  నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు .

మరోవైపు ఈ పందాల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుపుతారని చర్చ కూడా జరుగుతోంది. అద్దంకి ప్రాంతం నుంచి చెన్నైకి ముందుగా ఏ నెంబర్ ట్యాగ్ ఉన్న పావురం చేరుకుంటే.. ఆ పావురం నెంబర్ ను ఎంచుకున్న వ్యక్తి బెట్టింగ్ లో గెలిచినట్లుగా ప్రకటిస్తారని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు 4 లారీలను, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివిధ సంస్థలకు చెందిన పావురాలను ఈ పందెం కోసం తీసుకు వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే పావురాలను ఎగర వేసేందుకు అనుమతి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.ఇది బెట్టింగా?  శిక్షణా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో పావురాలను ఎగర వేసేందుకు రావడం పది రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Launches HPV Vaccine Program at Cheepurupalli, Ravivalasa | Asianet News Telugu
AP Food Commissioner Laughs: వాళ్ళు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడంలేదు సార్ | Asianet News Telugu