లాడ్జ్ గదిలో లింగమార్పిడీ ఆపరేషన్.. బీ ఫార్మసీ విద్యార్థుల అత్యుత్యాహం.. వికటించడంతో...

By SumaBala BukkaFirst Published Feb 26, 2022, 7:59 AM IST
Highlights

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరులో ఇద్దరు బీఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. లాడ్జ్ గదినే ఆపరేషన్ థియేటర్ గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ట్రాన్స్జెండర్ మృతి చెందాడు.

నెల్లూరు :  Hijraగా మారుస్తామని లింగ మార్పిడి చేసేందుకు మర్మాంగాన్ని తొలగించడంతో Severe bleeding అయి ఒక యువకుడు మృతి చెందాడు.  నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో B Pharmacy విద్యార్థులు ఈ శస్త్రచికిత్స చేశారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా jarugumalli మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి శ్రీకాంత్ అలియాస్ అమూల్య (28) చిన్నతనం నుంచి హైదరాబాదులో తాపీ పని కి వెళ్ళేవాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తెతోపెళ్లి అయింది. ఆరు నెలలకే  2020లో భార్యతో విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి  శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఒంగోలులో ఉంటున్నాడు. 

అక్కడ ఆయనకు విశాఖకు చెందిన మోనాలిసా అలియాస్ అశోక్ తో పరిచయం అయింది. ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆరు నెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న  మస్తాన్, జీవ పరిచయమయ్యారు. వీరిద్దరితో సాన్నిహిత్యం పెరిగిన తరువాత తాను ముంబయికి వెళ్లి Gender reassignment శస్త్ర చికిత్స చేయించుకుంటానని మస్తాన్ కు శ్రీకాంత్ చెప్పాడు. అందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, తాను బీఫార్మసీ విద్యార్థినని.. శస్త్రచికిత్స పై అవగాహన ఉందని.. తక్కువ ఖర్చుతో తానే చేస్తానని హామీ ఇచ్చాడు.

దీంతో అందరూ కలిసి 23వ తేదీన నెల్లూరులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. మస్తాన్, జీవాలు.. monalisa సాయంతో శ్రీకాంత్ కు గురువారం శస్త్ర చికిత్స ప్రారంభించారు. మర్మాంగాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. పల్స్ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడడంతో కొద్దిసేపటికే  శ్రీకాంత్ మరణించాడు.  దీంతో అక్కడి నుంచి పరారయ్యారు విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. 

మృతుడి వద్దనున్న ఆధారాలతో ఆయన అక్క పల్లవికి పోలీసులు సమాచారం అందించారు. మృత.దేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 
 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 14న కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు Transgenders వివాహం చేసుకున్నారు. Gender reassignment చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలోనే ఇది మొదటిసారి. Valentine's Dayనే ఈ పెళ్లి జరగడం విశేషం. ట్రాన్స్ జెండర్ లైన శ్యామ ఎస్ ప్రభ, మను కార్తీక పదేళ్లుగా స్నేహితులు. కార్తీక ఓ ప్రైవేట్ సంస్థ మానవ వనరుల విభాగంలో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్ జెండర్ విభాగం సమన్వయకర్త. ఐదేళ్ల క్రితమే Marriage చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో లింగ మార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ రకమైన  వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తన పెళ్లి ట్రాన్స్జెండర్ వివాహాల్లో సరికొత్త మైలు రాయి కానుందని ఈ సందర్భంగా ప్రభా, మను తెలిపారు.

click me!