అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 19, 2019, 09:16 AM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదవడుగూరు మండలం గుత్తిఅనంతపురం గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదవడుగూరు మండలం గుత్తిఅనంతపురం గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు రైతులు పని నిమిత్తం అనంతపురం వచ్చారు. డోన్ వరకు రైలులో వచ్చిన వారు అక్కడి నుంచి అనంత వెళ్లేందుకు ఓ అంబులెన్స్ ఎక్కారు.

గుత్తిఅనంతపురం వద్ద వేగంతో వెళ్తున్న అంబులెన్స్‌ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి