Perni Nani: చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Published : Dec 24, 2023, 12:12 AM IST
Perni Nani: చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Perni Nani:టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని  స్పందించారు. గతిలేక ప్రశాంత్ కిశోర్ తెచ్చుకున్నారన్నారు పేర్ని నాని. పవన్, టీడీపీ శ్రేణులపై చంద్రబాబుకు నమ్మకం పోయిందని అన్నారు.  

Perni Nani: ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.  ఎన్నికల వ్యూహాకర్త, గత ఎన్నికల్లో జగన్ పార్టీ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో  ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. వీరి భేటీ సూమారు గంటన్నర పాటు జరిగింది. ఈ భేటీలో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ శ్రేణులపై టీపీడీ అధినేత చంద్రబాబు నమ్మకం కోల్పోయారనీ, అందుకే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఎవరు వచ్చినా.. ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి వైసీపీనే గెలుస్తుందనీ, జగన్ నే మరోసారి అధికార పగ్గాలు చేపడుతారని స్పష్టం చేశారు. నిజంగా చంద్రబాబుకి సిగ్గు,శరం,మానాభిమానాలు ఏవీ లేవని, ఆయన చర్యలు చూస్తేనే అర్థమవుతుందని అంబటి మండిపడ్డారు. 

గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి చంద్రబాబు, లోకేశ్ లు ఏం మాట్లాడారో గుర్తుకు చేసుకోవాలనీ, బీహారోడు ఇక్కడికొచ్చి ఏం పీకుతాడనీ, బీహారోడి ఆట కట్టు, తోలు తీస్తామని వ్యాఖ్యానించారని గుర్తుకు చేశారు. బీహారోడికి ఇక్కడేం పని అని, తమకు ఎవరి సలహాలు అక్కర్లేదనీ,  తాము ప్రజలను నమ్ముకున్నామని గతంలో లోకేశ్ అన్నాడని గుర్తు చేశారు. మరి ఇవాళ ఎవడ్ని నమ్ముకున్నారు? మేం ఛీ కొడితే బయటికి వెళ్లినోడ్ని.. గతిలేక బతిమాలి తెచ్చుకున్నారనీ, పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదనీ, పార్టీ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu