
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) కుటుంబ సభ్యుల పేర్లు గానీ, ఆయన శ్రీమతి పేరు గానీ ఎవరూ ప్రస్తావించలేదని ఏపీ మంత్రి పేర్ని నాని (Perni nani) అన్నారు. అయినా దూషించారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కుటుంబ పరువును పణంగా పెట్టి మెలో డ్రామాను క్రియేట్ చేయడం బాధకరమని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సతీమనణిని ఎవరేమన్నారని ప్రశ్నించారు. ఇవతల ఉన్నవాళ్లు సంస్కారం లేని వాళ్లు అనుకుంటున్నారా..? అని అన్నారు.
వ్యవస్థనీ, రాజకీయాల్ని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పేర్ని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పేదల గుండెల్లో దేవుడితో సమానమైన స్థానం సంపాదించుకున్న రామారావు గురించి.. ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా, రాష్ట్రంలోని ప్రజల్లో కూడా విషాన్ని ఎక్కించాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిలో చంద్రబాబు దిట్ట అని.. ఇవాళ జరుగుతున్నది చంద్రబాబు దృష్టిలో చిన్నదని అన్నారు. చంద్రబాబు వికృత రాజకీయాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్న జగన్‌కు ఆ దేవుడే అండగా ఉండాలని అన్నారు.
అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన వీడియోలు వైరల్ చేశారని పేర్ని నాని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వీడియోలు చిత్రీకరిస్తున్నారు కదా అని ప్రశ్నించారు. జరగని విషయాన్ని రాజకీయ లబ్దికి ఉపయోగించుకుంటారా అని ప్రశ్నించారు.
Also read: 'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..
నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) ఓ అమాయక చక్రవర్తి.. చంద్రబాబు చెప్పిందే ఆయనకు కనబడుతుందని అన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది వినే పరిస్థితుల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారని.. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపే విషయంలో ఇలానే జరిగిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ప్రస్తావించలేదనే విషయాన్ని బాలకృష్ణకు మరోసారి తెలియజేస్తున్నానని అన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడటం అలవాటు చేసింది చంద్రబాబేనని ఆరోపించారు.
Also read: Nandamuri Balakrishna: చేతులు ముడుచుకుని కూర్చోం.. బద్దలు కొట్టుకుని వస్తాం.. బాలకృష్ణ వార్నింగ్
బాబాయ్- గొడ్డలి అని కామెంట్స్ చేస్తున్నారని.. ఆ రోజు అధికారంలో ఉన్నది చంద్రబాబేనని.. అప్పుడు అవినాశ్ రెడ్డిని ఎందుకు లోపల వేయలేదని ప్రశ్నించారు. టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు లేడని.. ఆయన కూడా పార్టీలు మారారని అన్నారు. ఇక్కడున్న వారిలో పార్టీలు మారని వారు ఎవరున్నారని ప్రశ్నించారు.