ఏపీఎస్ ఆర్టీసి స్టాఫ్ తొలగింపు: రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

By telugu teamFirst Published May 16, 2020, 2:19 PM IST
Highlights

ఏపీఎస్ ఆర్టీసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తలపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆర్టీసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల వేతనాలు చెల్లించని మాట వాస్తవమేనని అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు.  ఆర్టీసీ లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు.

వారికి కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వాడాలని సర్కలర్ ఇచ్చామని చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఏపీఎస్ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్: 7,600 మంది ఉద్యోగుల తొలగింపు, రోడ్డున పడ్డ కుటుంబాలు

కరోనా వల్ల ఆర్టీసీకి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దాని వల్ల మాత్రమే జీతాలు చెల్లించలేకపోయామని చెప్పారు. ఎవరిని తొలగించబోమని అన్నారు. యధావిధిగా కొనసాగుతారని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పనే ఉంటుంది గానీ తొలిగింపు ఉండదని ఆయన చెప్పారు.

ఎపీఎస్ఆర్టీసికి చెందిన 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ ప్రకటన చేసినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. విధులకు హాజరు కావద్దంటూ వారిని డిపో మేనేజర్లు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసి ఎఁడీ మాదిరెడ్డి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని వివరణ ఇచ్చారు.

click me!