కాంగ్రెసుపై చంద్రబాబు వ్యాఖ్య ఇది: దేనికి సంకేతం?

First Published Jul 26, 2018, 12:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రమంగా కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుకు వ్యతిరేకమనే అభిప్రాయాన్ని తుడిచేసేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రమంగా కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుకు వ్యతిరేకమనే అభిప్రాయాన్ని తుడిచేసేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. బుధవారం పార్టీ ఎంపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన తీరు దీనికి అద్దం పడుతోంది.  

కాంగ్రెసుపై రాష్ట్ర ప్రజలకు ఉన్న అసహ్యం తగ్గుముఖం పట్టిందని, రాజ్యసభలో కాంగ్రెసు ఎంపీలు చేసిన ప్రసంగాల వల్ల అది జరిగిందని ఆయన చెప్పారు. రాజ్యసభలో విభజన హామీలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న కాంగ్రెసు ఎంపీలు మాట్లాడిన తీరుపై ఆయన ఆ విధంగా అన్నారు. 

కాంగ్రెసుపై ఉన్న అసహ్యం తగ్గగా, బిజెపి అహంకారంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో టీడీపి పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది. 

తెలుగుదేశం లోకసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెసు పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడుతూ వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెసు పెద్దలు సోనియా, రాహుల్ గాంధీలతో చంద్రబాబు వేదికను పంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఆయన కాంగ్రెసుకు దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతూ వస్తోంది.

click me!