పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

Published : Mar 10, 2024, 09:20 PM IST
పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ పెనమలూరు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడినుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవలే టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆయనను కాదని మంత్రి జోగి రమేష్ కు సీటు కేటాయించింది వైసిపి అదిష్టానం. దీంతో టిడిపిలో చేరిన నూజివీడు టికెట్ దక్కించుకున్నారు పార్థసారథి. కానీ పెనమలూరు టిడిపి అభ్యర్థి ఎంపికలో టిడిపి తర్జనభర్జన పడుతోంది. 

పెనమలూరు రాజకీయాలు :

పెనమలూరు నియోజకవర్గంలో టిడిపి, వైసిపి లకు సమాన బలాలున్నాయి. నియోజకవర్గ ఏర్పాటుతర్వాత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టిడిపి, వైసిపి లు ఒక్కోసారి గెలిచాయి. అయితే ఓసారి కాంగ్రెస్, మరోసారి వైసిపి నుండి పెనమలూరు బరిలో నిలిచి గెలిచిన పార్థసారథి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే టిడిపిలో చేరారు. దీంతో పెనమలూరు రాజకీయ సమీకరణలు మారాయి. దీంతో ఈసారి పెనమలూరుపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనన్న ఆసక్తి రాజకీయా వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ నెలకొంది. 

పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1.  కంకిపాడు 
2. వుయ్యూరు 
3. పెనమలూరు
 
పెనమలూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  267803

పురుషులు -  130589
మహిళలు ‌- 137206

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

పెనమలూరు బరిలో మంత్రి జోగి రమేష్ నిలిచారు. ఆయనను పెడన నుండి ఇక్కడికి మార్చింది వైసిపి అధిష్టానం 

టిడిపి అభ్యర్థి :

పెనమలూరు టిడిపి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇంచార్జీగా కొనసాగుతున్నా టిడిపి-జనసేన అభ్యర్థుల మొదటిలిస్ట్ లో పెనమలూరు పేరు లేదు. దీంతో ఈ టికెట్ బోడె ప్రసాద్ కు దక్కకపోవచ్చన్న చర్చ సాగుతోంది. 

 
పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 2,13,929 

వైసిపి -  కొలుసు పార్థసారథి - 1,01,485 (47 శాతం) - 11,317 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - బోడె ప్రసాద్ - 90,168 (42 శాతం) -  ఓటమి 

బహుజన్ సమాజ్ వాది పార్టీ (బిఎస్పి) - ఎల్. కరుణాకర్ దాస్ - 15,388 (7 శాతం) - ఓటమి 


పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

టిడిపి - బోడె ప్రసాద్ - 1,02,330 (54 శాతం) - 31,448 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం 
 
వైసిపి -  వీఆర్ విద్యాసాగర్  కుక్కల - 70,882 (38 శాతం) - ఓటమి 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu