పవనే తదుపరి సిఎం...అట

Published : Jul 03, 2017, 09:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పవనే తదుపరి సిఎం...అట

సారాంశం

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయటమే తమ ధ్యేయంగా చెప్పటం గమనార్హం. ఏంటి నిజమేనా అని అనుమానం వద్దు. ఎందుకంటే, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు అలానే చెబుతున్నారు. సాధారణ ఎన్నికల సంగతి సరే, రేపే మాపో జరగబోతున్న నంద్యాల ఉపఎన్నికల సంగతేంటని మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.

‘వచ్చే ఏడాది మార్చి నుండి జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యక్ష  రాజకీయాల్లోకి వస్తారు’ ఇది జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి చెప్పిన మాటలు. ఆదివారం తిరుపతిలో మాట్లాడుతూ, పార్టీ నిర్మాణం వేగంగా జరుగుతోందట. వచ్చే మార్చికి క్షేత్రస్ధాయిలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కూడా రెడ్డి చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయటమే తమ ధ్యేయంగా చెప్పటం గమనార్హం. ఏంటి నిజమేనా అని అనుమానం వద్దు. ఎందుకంటే, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు అలానే చెబుతున్నారు. సాధారణ ఎన్నికల సంగతి సరే, రేపే మాపో జరగబోతున్న నంద్యాల ఉపఎన్నికల సంగతేంటని మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.

అందుకు అవసరమైన క్షేత్రస్ధాయి వ్యవహారాలను వేగంగా పూర్తవుతోందట. పవన్ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జనసేన కార్యకర్తలందరూ అవిరళ కృషి చేస్తారట. పవన్ను సిఎంగా రాష్ట్ర ప్రజలు చూస్తరంటూ ఆశాభావాన్ని కూడా రెడ్డి వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లాలో 2400 మందికిపైగా జనసేన కార్యకర్తలు కంటెంట్ రైటర్స్, అనలిస్ట్, స్పీకర్లుగా దరఖాస్తు చేసుకున్నట్లు రెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu