రోహిత్ ఎందుకు చనిపోయాడో చెప్పిన పవన్

Published : Dec 16, 2016, 08:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రోహిత్ ఎందుకు చనిపోయాడో చెప్పిన పవన్

సారాంశం

కాషాయికరణపై స్పందిస్తే రోహిత్ ను అవమానించారు అందుకే అతని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రోహిత్ ఘటనపై పవన్ ట్వీట్

రోహిత్ వేములకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఒక మేధావిని దేశం కోల్పోయేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు.

 

రోజు ఒక అంశంపై ఇక పై స్పందిస్తానని శుక్రవారం చెప్పిన పవన్ అందుకు తగ్గట్టు గా  ఈ రోజు రోహిత్ ఘటనపై ట్విటర్లో  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

కాషాయికరణపై తొందరపాటులో ఏదో అన్నందుకే రోహిత్ ను  క్యాంపస్‌ నుంచి పంపించారని అన్నారు. అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు.

 

బీజేపీపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన రోహిత్‌ వేములను  వేధించే అధికారం ఆ పార్టీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివని వెల్లడించారు.

 

రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు కేంద్రం ప్రయత్నించడం దారుణమన్నారు. రోహిత్‌కు అతని సామాజిక వర్గం నుంచి కూడా సహకారం అందలేదన్నారు.

 

ప్రతి పార్టీ దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకుందని ఆరోపించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?