గబ్బు పట్టిన యాక్సెస్ బ్యాంకు

Published : Dec 16, 2016, 07:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
గబ్బు పట్టిన యాక్సెస్  బ్యాంకు

సారాంశం

నోట్ల రద్దు విషయంలో బాగా గబ్బు పట్టిన బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకుదే అగ్రస్ధానం.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం మొత్తం మీద యాక్సిస్ బ్యాంకుపైనే బాగా బురద అంటుకున్నది. నోట్ల రద్దు తర్వాత అవసరానికి సరిపడా డబ్బు చెలామణిలోకి రాలేదు. దాంతో చేతిలో డబ్బులేక సామాన్య జనాలు గడచిన 40 రోజులుగా రోడ్లపైనే ఉన్నారు.

 

అదే సమయంలో కొందరు బడాబాబులకు మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్లు వారి ఇళ్ళకే నడుచుకుంటు వెళ్లాయి. దాంతో దేశంలో గగ్గోలు మొదలైంది. ఓవైపు 2 వేల నోటు కోసం సామాన్యులు క్యూలైన్లలో నిలబడి మరణిస్తుంటే, కుబేరులకు మాత్రం ఎటువంటి కష్టమూ లేకుండానే కోట్ల రూపాయలు అందుతోంది.

 

ఈ విషయంలో ప్రజలందరూ బ్యాంకులపైనే మండిపడుతున్నారు. కొన్ని బ్యాంకులు దొడ్డిదోవన బడాబాబులకు కోట్ల రూపాయలు పంపేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే, రోజులు గడిచేకొద్దీ ప్రజల అనుమానాలు, ఆరోపణలు నిజమవుతున్నాయి.

 

నోట్ల రద్దు విషయంలో బాగా గబ్బు పట్టిన బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకుదే అగ్రస్ధానం. ఈ బ్యాంకు శాఖలపై దేశం మొత్తం మీద ఆదాయపు పన్ను శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ తదితర శాఖలు పలుమార్లు దాడులు జరిపాయి. దాడుల్లో నకిలీ ఖాతాలు, పాత నోట్లకు కొత్త మార్పిడి కుంబకోణంలో పలువురి ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతోంది.

 

దాంతో జరిగిన కుంభకోణంలో యాక్సిస్ బ్యాంకుదే ప్రధానపాత్రగా ప్రచారం జరుగుతోంది. నకిలీ ఖాతాల్లో కోట్లాది రూపాయలు దొరుకుతుండటం, ఉన్నతాధాకారులు ఆధారాలతో సహా పట్టుబడుతుండటంతో అసలు బ్యాంకింగ్ లైసెన్సే రద్దు అవుతోందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

 

ఇదే విషయమై బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ మాట్లాడుతూ తమ బ్యాంకు పరువు గంగలో కలిసిపోయినట్లు వాపోయారు. తమ బ్యాంకు ప్రతిష్టకు తీవ్ర భంగం కలగటం తమను కలచివేస్తోందన్నారు.

 

అయితే, దేశంలో ఇన్ని బ్యాంకులుండగా ఒక్క యాక్పిస్ బ్యాంకుపైన మాత్రమే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వారి ఉన్నతాధికారులు మాత్రమే ఎలా పట్టుపడుతున్నారనే విషయంపైన కూడా రాజీవ్ ఆనంద్ చెబితే బాగుంటుందేమో.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?