ఏలూరు ఓటరు కాబోతున్న పవన్ కల్యాణ్

First Published Oct 31, 2016, 1:15 PM IST
Highlights

ఏలూరులో  ఓటు నమోదు చేయించుకునేందుకు పవన్ కల్యాణ్ నిర్ణయం

అక్కడొక మంచి ఇల్లు కూడా తీసుకోవాలనుకుంటున్న జనసేన నేత

ఏలూరు కేంద్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందు తన కార్యకలాపాలను సాగించనున్నారు. అక్కడ ఆయనకు ఓటు హక్కు, ఒక అడ్రసు ఉండేలా ఏర్పాట్లు మొదలయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేసే ముందు రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడం విమర్శలకు తావిస్తుందని జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ గుర్తించినట్లున్నారు. తను ఆంధ్రలో ఒక ఇంటి వాడయ్యేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును ఎంపిక చేసుకున్నారు.  అక్కడే  ఓటు హక్కును నమోదు చేయించుకోవాలనుకుంటున్నారు.

 

  సోమవారంనాడు తనన కలువడానికి పెద్ద ఎత్తు నవచ్చిన జిల్లా అభిమానులతో  మాట్లాడాక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన జనమంతా పశ్చిమ గోదావరి జిల్లానుంచే ఓటరుగా నమోదు చేయించుకోవాలని కోరారని, దానికి ఆయనఅంగీకరించారని పార్టీ   ఒకప్రకటనలోతెలిపింది.

 

అభిమానుల అభిమతం ప్రకారం ఓటు హక్కును నమోదు చేయించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన తన పార్టీలోని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరులో తనకు అనుకూలమయిన నివాస భవనాన్ని వెదకాలని కూడా ఆయన సూచనలిచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఓటరు. గత ఎన్నికలలో జూబ్లిహిల్స్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

click me!