లంచం అడిగితే కాల్ "1100"

Published : Sep 06, 2017, 05:02 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
లంచం అడిగితే కాల్ "1100"

సారాంశం

లంచం అడిగితే "1100" కి కాల్ చేయాలని చంద్రబాబు పిలుపు. ప్రజల అభివృద్దే ధ్వేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. "జలసిరికి హారతి" కార్యాక్రమాన్ని ప్రారంభించారు.

ఎవరైనా లంచం అడిగితే "1100" నంబర్ కి కాల్ చేయాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు పొందే క్ర‌మంలో ఎవ‌ర‌యినా అధికారులు డ‌బ్బులు అడిగినా, ఎటువంటి ఇబ్బందులకు గురిచేసిన "1100"కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌ని చంద్రబాబు చెప్పారు. నూతనంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభివృద్దే ధ్వేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా "జ‌ల‌సిరికి హార‌తి" కార్య‌క్ర‌మం ప్రారంభిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చెప్పారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నం జిల్లా క‌శింకోట మండ‌లం న‌ర్సాపురంలో "జ‌ల‌సిరికి హార‌తి" కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు పాల్గొన్నారు. అనంత‌రం న‌ర్సాపురం ఆన‌క‌ట్ట‌ను ప్రారంభించి, అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు.  తాము రాష్ట్రంలో మహిళల కోసమే "దీపం" ప‌థ‌కం ప్రారంభించామ‌ని చెప్పుకొచ్చారు. ఏపీలో 18 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామ‌ని చంద్రబాబు చెప్పారు. వృద్ధాప్య పింఛ‌న్లను రూ.1000కి పెంచామ‌న్నారు. హుద్‌హుద్‌తో అత‌లాకుత‌ల‌మైన విశాఖ‌ప‌ట్నాన్ని మ‌ళ్లీ సుంద‌రంగా తీర్చిదిద్దామ‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ల‌బ్ధిదారులంద‌రికీ న్యాయం జ‌రిగేలా చూస్తామ‌న్నారు. అందుకే "1100" నంబర్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి....

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్