ఉత్తరాదికి వ్యతిరేకం కాదు

Published : May 11, 2017, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఉత్తరాదికి వ్యతిరేకం కాదు

సారాంశం

ఉత్తరాదికి గాని హిందీభాషకు కానీ తాను వ్యతిరేకమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ఉత్తర భారతదేశానికి తాను వ్యతిరేకం కాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చుకున్నారు. కొద్ది రోజులుగా పవన్ చేస్తున్న ట్వీట్లలో తరచూ ఉత్తరాది-ధక్షణాది అంటూ ప్రస్తావిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తమ సమస్యలను చెప్పుకునేందుకు బిటెక్ విద్యార్ధలు ఈరోజు పవన్ ను కలిసారు. ఆ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాదికి గాని హిందీభాషకు కానీ తాను వ్యతిరేకమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ధక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ధక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాదివారికి కీలక పదవులు ఇవ్వటంలో తప్పు లేదన్నారు. మరి, దక్షిణాది వారికి కూడా ఉత్తరాదిలో కీలక పదవులు ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నించారు. అలా ఇవ్వకపోతేనే దక్షిణాదిలో అశాంతి ప్రబలే ప్రమాధముందని ఆందోళన వ్యక్తం చేసారు. ధక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. కేంద్రం ధక్షిణదివారిని ద్వితీయ శ్రేణి పైరులుగా చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ముందు కూడా నిర్భయంగా చెప్పగలనని పవన్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu