సుప్రింకోర్టుకే తలనొప్పిగా తయారయ్యారు

First Published May 11, 2017, 10:17 AM IST
Highlights

న్యాయవ్యవస్ధలో దశాబ్దాల పాటు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తే సుప్రింకోర్టు ఆదేశాలను పాటించకపోతే ఇక, ఇతరులు సుప్రింకోర్టును ఏం లెక్క చేస్తారు? ఇంతకాలం ఆయనిచ్చిన తీర్పులకు మాత్రం ఏం విలువుంటుంది? కర్ణన్ వ్యవహారం ఇపుడు సుప్రింకోర్టుకు పెద్ద తలనొప్పిగానే కాకుండా సవాలుగా కూడా మారిందన్నది వాస్తవం.

ఆయనకు న్యాయవ్యవస్ధతో దశాబ్దాల అనుబంధముంది. కలకత్తా హై కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు, తీర్పులూ ఇస్తున్నారు. అంటే న్యాయస్ధానం ఇచ్చే ఆదేశాలకు, తీర్పులకు ఎంత విలువుంటుందో బాగా తెలుసు. వాటిని ధిక్కరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటుందో ఆయనకు ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తే ఇపుడు సుప్రింకోర్టుకు పెద్ద తలనొప్పిగా మారారు.

ఇంతకీ ఆయనెవరంటారా? ఆయనేనండి, కలకత్తా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ కర్ణన్.  విషయం తనదాకా వచ్చేటప్పటికి తనకు వ్యతిరేకంగా వచ్చే ఏ ఆదేశాన్ని కూడా లెక్కచేయనని తెగేసి చెబుతున్నారు. ఒక కేసుకు సంబంధించి జస్టిస్ కర్ణన్ కు సుప్రింకోర్టుకు మధ్య ప్రతిష్ట ఏర్పడింది. సదరు వివాదంలో జస్టిస్ కర్ణన్ సుప్రింకోర్టు జడ్జీలకు ఆరుమాసాల జైలుశిక్ష విధిస్తే, సుప్రింకోర్టు రాజ్యంగ ధర్మాసనం కర్ణన్ కు ఆరుమాసాల జైలుశిక్ష విధించింది.

జైలుశిక్ష విధించిన వెంటనే కర్ణన్ ను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పశ్చిమబెంగాల్ డిజిపిని సుప్రింకోర్టు ఆదేశించింది. అంతే అప్పటి నుండి కర్ణన్ కనిపించటం లేదు. ఎక్కడున్నరో ఎవరికీ అర్ధం కావటం లేదు. సుప్రింకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేసేది లేదంటున్నారు. ఆదేశాలిచ్చి ఇప్పటికి మూడు రోజులైనా పోలీసులు కర్ణన్ ఆచూకీని కనిపెట్టలేకపోయారు. స్వరాష్ట్రం తమిళనాడులో చాలా చోట్ల పోలీసులు వెతికినా కర్ణన్ దొరకలేదు. అసలు దేశంలోనే ఉన్నారా లేరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

న్యాయవ్యవస్ధలో దశాబ్దాల పాటు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తే సుప్రింకోర్టు ఆదేశాలను పాటించకపోతే ఇక, ఇతరులు సుప్రింకోర్టును ఏం లెక్క చేస్తారు? ఇంతకాలం ఆయనిచ్చిన తీర్పులకు మాత్రం ఏం విలువుంటుంది? కర్ణన్ వ్యవహారం ఇపుడు సుప్రింకోర్టుకు పెద్ద తలనొప్పిగానే కాకుండా సవాలుగా కూడా మారిందన్నది వాస్తవం. ఏదేమైనా ఇటువంటి ఘటన తలెత్తటం దేశంలో ఇదే ప్రధమం. మరి కర్ణన్ వ్యవహారాన్ని సుప్రింకోర్టు ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి.

 

 

click me!