పవన్ కల్యాణ్ కు షాక్: జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాసు గల్లంతు

By telugu teamFirst Published Sep 26, 2021, 7:31 AM IST
Highlights

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సీఈసీ షాక్ ఇచ్చింది. జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయించిన గుర్తు ఇప్పుడు ఫ్రీ సింబల్ అయింది. ఈ గుర్తును ఎవరికైనా కేటాయించవచ్చు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఫ్రీ సింబల్ కెటగిరీలో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఆ విషయాన్ని ప్రకటించింది. దాంతో గాజు గ్లాసు గుర్తును రిటర్నింగ్ అధిాకరులు నిబంధనల మేరకు తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పా్రటీ అభ్యర్థులకే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుకు కేటాయించే అవకాశం ఉంటుంది. 

ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో కూడా గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల కెటగిరీలో మూడు పార్టీలకే సీఈసీ మూడు పార్టీలకే రిజర్వ్ డ్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెసుకు సీలింగ్ ఫ్యాన్ గుర్తును, టీడీపీకి సైకిల్ గుర్తును, టీఆర్ఎస్ కు కు కారు గుర్తులు రిజర్వ్ డ్ గా ఉంటాయని సీఈసీ తెలిపింది. జాతీయ పార్టీల కెటిగిరీలో బిజెపి, కాంగ్రెసు, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెసు, బిఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వ్ డ్ గుర్తులుంటాయని సీఈసీ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్ కాంగ్రెసు, టీడీపీలకు వాటి వాటి గుర్తులు రిజర్వ్ డ్ ఉంటాయని సీఈసీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి సీలింగ్ ఫ్యాన్, టీడీపీకి సైకిల్ గుర్తులు రిజర్వ్ డ్ గా ఉంటాయి.

click me!