కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... ముగ్గురు యువకులు మృతి

Published : Sep 26, 2021, 07:22 AM ISTUpdated : Sep 26, 2021, 07:38 AM IST
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... ముగ్గురు యువకులు మృతి

సారాంశం

బైక్ వెళుతున్న ముగ్గురు యువకులు రోడ్డుప్రమాదాని గురయి ప్రాణాలు కోల్పోయిన సంఘటన విజయవాడ సమీపంలో చోటుచేసుకుంది. 

విజయవాడ: రోడ్డు ప్రమాదానికి గురయి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి యువకులు బైక్ వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. మంచి స్పీడులో వుండగా ప్రమాదం జరగడంతో ముగ్గురు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా నూజివీడు మండలం కండ్రిక నుండి ముగ్గురు యువకులు శనివారం రాత్రి బైక్ పై పాతపాడుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు వేగంగా వెళుతూ రహదారి నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన జాకీలను ఢీకొట్టారు. దీంతో ఎగిరి రోడ్డుపై పడ్డ యువకులు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

read more  కర్నూలులో జంట హత్యల కలకలం.. అక్రమ సంబంధమే కారణం?

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకులు వాంబే కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్