
అనంతపురం: Sathyasai district జిల్లాలోని గోరంట్ల మండలం వానవోలులో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది. తల్లిని రాళ్లతొ కొట్టి చంపాడు కొడుకు. తల్లికి Extra marital Affair ఉందనే అనుమానంతో పవన్ Eshwarammaను కొట్టి చంపాడు. తల్లి చనిపోయిన తర్వాత పవన్ పోలీసులకు లొంగిపోయాడు.
వివాహేతర సంబంధాల విషయమై Mother ని పలమార్లు కొడుకు హెచ్చరించాడు. అయినా కూడా ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో పొలం వద్ద ఆమెను హత్య చేసినట్టుగా గ్రామస్థులు చెబుతున్నారు.ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకొంటున్నాయి. మహిళలపై గ్యాంగ్ రేప్ లు, అత్యాచారాలు కలకలం రేపుతున్నాయి.
రేపల్లే రైల్వే స్టేషన లో జిరగిన గ్యాంగ్ రేప్ ఘటన ఏపీలో పెద్ద సంచలనం రేపింది. కృష్ణా జిల్లాలో పని కోసం వచ్చిన మహిళపై రేపల్లే రైల్వే స్టేషన్ గ్యాగ్ రేప్ జరిగింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఓ మైనర్ కూడా ఉన్నారు.బాధితురాలికి ఒంగోల్ రిమ్స్ లో చికిత్స నిర్వహించారు. ఇటీవలనే ఆమె ఒంగోలు రిమ్స్ నుండి డిశ్చార్జ్ అయింది.బాధిత కుటుంబాన్ని ఆదుకొంటామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
అంతకు ముందు పల్నాడు జిల్లా గురజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు.
ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.
ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో మహిళలపై పెద్ద ఎత్తున దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాల ఆరోపణలను అధికార పక్షం తోసిపుచ్చింది. మహిళలపై దాడులు, అత్యాచారాల కేసుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు.