Pawan Kalyan: వైకాపా పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయ్‌: పవన్‌ క‌ళ్యాణ్

Google News Follow Us

సారాంశం

Amaravati: కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు.. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శలు గుప్పించారు.
 

Jana Sena president Pawan Kalyan: కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు.. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శలు గుప్పించారు.

వివ‌రాల్లోకెళ్తే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వైకాపా స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చెట్ల‌ను న‌రికివేయ‌డం పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకవద్దని సంబంధిత అధికారులకు సీఎస్ చెప్పాలని పేర్కొన్న ప‌వ‌న్.. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని అన్నాఉ. అలాంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేయ‌డంపై మండిప‌డ్డారు.

ప‌వ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా.. "శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'పుష్ప విలాపం' చదవకపోతే జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు (మొక్కలు, చెట్లు దెబ్బతిన్నప్పుడు ఎలా అనిపిస్తాయో) అర్థం కానప్పుడు ఇలా జరుగుతుంది. సీఎం కాకపోతే కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా విచక్షణారహితంగా చెట్లను నరికివేయవద్దని సంబంధిత అధికారులకు సూచించాలని" పేర్కొన్నారు.

అలాగే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'పుష్ప విలాపం' లోని ఒక భాగాన్ని ప్ర‌స్తావించారు...
‘‘ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ’’ అనే పద్యాన్ని పవన్‌ పోస్ట్‌ చేశారు.

 

Read more Articles on