జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై విజయవాడ కోర్టులో మహిళా వాలంటీర్ ఇవాళ ఫిర్యాదు చేశారు.
విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై విజయవాడ కోర్టులో సోమవారంనాడు మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనోవేదనకు గురి చేశాయని ఆమె పేర్కొన్నారు. విజయవాడ సివిల్ కోర్టులో మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేశారు. మహిళా వాలంటీర్ తరపున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. వాలంటీర్ తరపున ఆమె తరపు న్యాయవాదులు క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించినట్టుగా మహిళ వాలంటీర్ తరపు న్యాయవాది ఒకరు మీడియాకు చెప్పారు.
ఈ నెల 9వ తేదీన ఏలూరు జిల్లాలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు దోహదపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పై మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు, వాలంటీర్లు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఆందోళనలు నిర్వహించారు.
undefined
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై కోర్టులో ఫిర్యాదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ నెల 20న ఆదేశించింది. ఈ తరుణంలో ఇవాళ విజయవాడ కోర్టులో మహిళ వాలంటీర్ పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తమను తీవ్ర మనోవేదనకు గురి చేశాయని కోర్టులో ఫిర్యాదు చేసిన వాలంటీర్ మీడియాకు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను కించపర్చే వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తాను కూడ సిద్దంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీనే ప్రకటించారు.
also read:వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: కోర్టులో ఫిర్యాదుకు జగన్ సర్కార్ నిర్ణయం
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను వాలంటీర్లు సేకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ గత రెండు మూడు రోజులుగా ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కొన్ని వీడియోలను కూడ పోస్టు చేశారు. వాలంటీర్లకు బాస్ ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ఎక్కడ భద్రపరుస్తున్నారని ఆయన అడిగారు. తాను లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని కూడ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ కోరారు.