
ఉత్తరాంధ్రలో బుధవారం నుండి పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. గతంలో ఎప్పుడో పవన్ ఉథ్థానంలో కిడ్నీ బాధితుల పేరిట శ్రీకాకుళంలో పర్యటించారు. తర్వాత ప్రభుత్వం పరంగా కొంత చర్యలు కనిపించాయి. అయితే, మళ్లీ ఏమైందో తెలీదు. తాజాగా పవన్ పర్యటనతో అధాకారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగి కుటుంబాన్ని కూడా పవన్ పరామర్శించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత పవన్ ప్రకాశం జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై తరచూ పవన్ పర్యటనలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపరంగా బాగా వెనుకబడిన ప్రాంతం కావటంతో పవన్ వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రనే ఎన్నుకున్నట్లు కనబడుతోంది.