వారాహిపై జనసేనాని:విజయవాడ నుండి మచిలీపట్టణానికి పవన్

By narsimha lode  |  First Published Mar 14, 2023, 3:07 PM IST

జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు  పవన్  కళ్యాణ్ వారాహి వాహనంలో  మచిలీపట్టణానికి బయలు దేరారు. 


విజయవాడ: జనసేన  ఆవిర్భావ  సభలో  పాల్గొనేందుకు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  మంగళవారంనాడు మధ్యాహ్నం  విజయవాడ నోవాటెల్ హోటల్ నుండి  బయలుదేరారు. విజయవాడ నుండి  ఆటో నగర్ వరకు  పవన్ కళ్యాణ్  కారులో  చేరుకున్నారు.. అక్కడి నుండి  వారాహి వాహనంలో  మచిలీపట్టణం పవన్ కల్యాణ్  బయలుదేరారు. వారాహి వాహనంపైకి ఎక్కిన  పవన్ కళ్యాణ్  పార్టీ శ్రేణులకు , ప్రజలకు అభివాదం  చేశారు.   పవన్ కళ్యాణ్ పై  పార్టీ శ్రేణులు  పూలు  చల్లుతూ  తమ హర్షాన్ని వ్యక్తం  చేశారు.  వారాహి వాహనంపై  నిలబడి అభివాదం  చేస్తూ  మచిలీపట్టణం  వైపు వపన్ కళ్యాణ్  ముందుకు  సాగారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకొని మచిలీపట్టణంలో  ఇవాళ భారీ సభను  ఆ పార్టీ ఏర్పాటు  చేసింది.  విజయవాడ ఆటోనగర్  నుండి  మచిలీపట్టణం వరకు   పవన్ కళ్యాణ్  ర్యాలీగా  బయలుదేారారు... పవన్ కళ్యాణ్ వెంట  జనసేన  కార్యకర్తలు,  పవన్ కళ్యాణ్ అభిమానులు వెంట నడిచారు.

Latest Videos

undefined

జిల్లాలో  ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా  30 పోలీస్ యాక్ట్ అమలులో  ఉందని  జిల్లా ఎస్పీ జాషువా  ప్రకటించారు.  బైక్ ర్యాలీలకు  అనుమతి లేదని  పోలీసులు నిన్న రాత్రే  జనసేన  నేత మహేష్ కు నోటీసలుు అందించారు.

మచిలీపట్టణంలో  సాయంత్రం  జనసేన   సభలో  పవన్ కళ్యాణ్  ఏం చెబతారనేది రాజకీయ వర్గాల్లో  ఆసక్తి నెలకొంది.  గత ఏడాది  ఇప్పటంలో  నిర్వహించిన  జనసేన ఆవిర్భావ  సభలో  విపక్షాల  ఐక్యత  గురించి  పవన్ కళ్యాణ్  చెప్పారు.  జగన్ ను గద్దె దించాలంటే  విపక్షాల మధ్య  ఐక్యత ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి  చెప్పారు. 

also read:నేడే జనసేన ఆవిర్భావ సభ.. పవన్ కల్యాణ్ వారాహి ప్రారంభంలో కీలక మార్పు..

జనసేన 10వ వార్షికోత్సవ సభలో  పవన్ కళ్యాణ్  ఏ రకమైన రాజకీయ ఎజెండాను ప్రకటించనున్నారనేది  సర్వత్రా ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో  వైసీపీని అధికారంలోకి రాకుండా చూస్తామని  పవన్ కళ్యాణ్  ప్రకటించారు.  అయితే  ఈ సభలో   పొత్తులపై  పవన్ కళ్యాణ్  ప్రకటిస్తారా అనే విషయమై  రాజకీయ  వర్గాల్లో  ఉత్కంఠ నెలకొంది. 

click me!