‘జనసేన’ ప్లీనరీ...త్వరలో రాష్ట్రాల పర్యటనలు

First Published Oct 22, 2017, 8:15 PM IST
Highlights
  • జనసేన ఆధ్వర్యంలో త్వరలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని ఆపార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
  • పార్టీలోని ముఖ్యులతో ఆదివారం పవన్ కీలక సమావేశం నిర్వహించారు.
  • ముందస్తు ఎన్నికల వాతావరణం కనబడుతుండటంతో పవన్ కూడా పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని నిర్ణయించారు.

జనసేన ఆధ్వర్యంలో త్వరలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని ఆపార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీలోని ముఖ్యులతో ఆదివారం పవన్ కీలక సమావేశం నిర్వహించారు. ముందస్తు ఎన్నికల వాతావరణం కనబడుతుండటంతో పవన్ కూడా పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. భవిష్యత్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ వడివడిగా అడుగులేస్తుంది. పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ప్రజలలోకి తీసుకెళ్లాలనే అంశం పై ప్రధానంగా చర్చించారు. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పర్యటించాలని పవన్ నిర్ణయించారు. ఆరు నెలలో పార్టీపరంగా చెపటాల్సిన విషయాల్ని చర్చించారు. పార్టీని బలోపేతం చేయాలన్నదే ద్యేయంగా పవన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే పార్టీ నిర్ణయాలని ప్రజలకి తెలియచేసే కీలకమైన ప్లీనరీని అతి త్వరలో చేపట్టాలని పవన్ నిర్ణయం చేశారు.

ప్లీనరీ ద్వారా జనసేన ఆశయాలు, భవిష్యత్తు కార్యక్రమాలతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలు ప్రజలకి తెలియచేయాలని ఆలోచనలో జనసేన అధినేత ఉన్నారు. అందుకే త్వరలో ప్లీనరీ నిర్వహించే తేదీ స్థలం వివరాల్ని వెలడించనున్నట్లు జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ చెప్పారు. వ్యవహారం చూస్తుంటే జనసేన పూర్తి స్థాయిలో జనంలోకి రావటానికి సన్నదమవుతున్నట్లే కనబడుతోంది.

 

 

 

 

click me!