మనకి తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు.. విజయనగరం చక్కెర రైతులకు పవన్ బాసట

Siva Kodati |  
Published : Nov 04, 2021, 04:57 PM IST
మనకి తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు.. విజయనగరం చక్కెర రైతులకు పవన్ బాసట

సారాంశం

విజయనగరం జిల్లా (vizianagaram district ) బొబ్బిలి (bobbili) ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం (ncs sugar factory) వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) మద్దతు ప్రకటించారు. 

విజయనగరం జిల్లా (vizianagaram district ) బొబ్బిలి (bobbili) ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం (ncs sugar factory) వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) మద్దతు ప్రకటించారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నింపుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు తమకు రావాల్సిన బకాయిల కోసం దాదాపు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని జనసేనాని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని పవన్ ఆరోపించారు. 

గత రెండేళ్ల నుంచి చెరకు రైతులకు రూ.16.38 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని పవన్ కల్యాణ్ వివరించారు. తమకు రావాల్సిన బకాయిల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని పాలనా యంత్రాంగం శాంతిభద్రతల సమస్యగా చూడడం సరికాదని ఆయన హితవు పలికారు. రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారిలో ఆగ్రహాన్ని పెంచారని పవన్ దుయ్యబట్టారు. తక్షణమే బకాయిలు ఇప్పించాల్సిన సర్కారు, జనవరిలో చెల్లింపులు చేసేలా చక్కెర కర్మాగారం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని పవన్ విమర్శించారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే వెసులుబాటు ఉన్నా, ఈ చట్టాన్ని ప్రభుత్వం వినియోగించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:విజయనగరం : బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

అంతకుముందు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు (deepavali wishes) చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారుపై (ap govt) విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని.. దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నా అన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని.. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన తన తరపున, తన పార్టీ జనసేన తరపున పవన్ శుభాకాంక్షలు తెలిపారు. 

పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ లహానికరం కానీ మందుగుండు సామాగ్రితో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమన్నారు జనసేనాని. ఈ దీపావళిని ఆనందకేళిగా మలుచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?